telangana elections 2023 : కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.. అసదుద్దీన్ ఓవైసీ
ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ కేసీఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్నామని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న కొద్ది అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే మజ్లీస్ పార్టీ తరపున అసదుద్దీన్ ఓవైసీ ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థుల తరఫున కార్నర్స్ మీటింగ్స్, బహిరంగ సభలో అలుపెరుగని ప్రచారం చేస్తున్నారు అసదుద్దీన్. ఈ క్రమంలోనే జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆయన మళ్లీ కెసిఆర్ అధికారంలోకి వస్తారని.. హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
గతంలో కూడా తాను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీతో లేమని, కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి తో మాత్రమే ఉన్నామని చెప్పుకొచ్చారు. నిజామాబాదులో ఆర్ఎస్ఎస్ బలపడొద్దని తాము పోటీ చేయడం లేదన్నారు. అజారుద్దీన్ పై కూడా ఆసక్తికరమైన కామెంట్ చేశారు. అజారుద్దీన్ ఓ మంచి క్రికెటర్ అని చెప్పుకొచ్చాడు. కానీ విఫల రాజకీయ నాయకుడు అన్నారు. అజహారుద్దీన్ ను కేటీఆరే హెచ్సీఏ ప్రెసిడెంట్గా చేశారని గుర్తు చేశారు.
tummala nageswara rao: నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ కోసం... ఎత్తులకు పై ఎత్తులు
పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి జీవితం ఆర్ఎస్ ఎస్ లోనే ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. తెలంగాణ గాంధీ భవన్ రిమోట్ ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ చేతిలో ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ నియోజకవర్గం కోసం ఏ పని చేయలేదని, ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. అందుకే జూబ్లీహిల్స్లో బలమైన అభ్యర్థిని ఎంఐఎం బరిలోకి దించిందన్నారు.