KTR: ప్రజలను నమ్మించలేక అసత్య ప్రచారాలు.. కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ ఫైర్

Kalvakuntla Taraka Rama Rao: పార్టీ ఎన్నిక‌ల‌ వాగ్దానాలను ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలనీ, కాంగ్రెస్-బీజేపీలు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు (కేటీఆర్) పిలుపునిచ్చారు. కుటుంబంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయనీ, వాటిని అధిగమిస్తామని పార్టీ ప‌రిస్థితుల‌ను పేర్కొన్నారు.
 

Telangana Elections 2023: False propaganda that can't convince people, BRS Leader K Taraka Rama Rao hits out at Congress, BJP RMA

Telangana Assembly Elections 2023: అధికార పార్టీ భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు (కేటీఆర్) మ‌రోసారి కాంగ్రెస్, భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ)ల‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఉప ఎన్నికల్లో ఎన్నికైన భారతీయ జనతా పార్టీ (ఎమ్మెల్యే), అకాల మ‌ర‌ణానికి గురైన‌ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పనులను పోల్చి చూడాలని దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా కేటీఆర్ అన్నారు.

మెదక్‌ సిట్టింగ్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి దుబ్బాకలో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్న కేటీఆర్.. ఈసారి ఓటర్లను నమ్మించలేక బీజేపీ అభ్యర్థి భూములు కాజేస్తున్నారని అసత్యాలు, దుష్ప్రచారం చేస్తున్నారని మండిప‌డ్డారు. బీఆర్‌ఎస్‌కు మళ్లీ ఓటేస్తే పేదలను దోచుకుంటార‌ని అస‌త్య ప్ర‌చారం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల్లో ఆ రెండు పార్టీలకు ప్ర‌జ‌లు త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని పేర్కొన్నారు.

మరోవైపు ప్రతి విషయంలోనూ ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. గ‌త కాంగ్రెస్ పాల‌న‌ను గుర్తుచేస్తూ.. ఒక వ్యక్తి చనిపోతే అంత్యక్రియల్లో పాల్గొని బోరుబావుల వద్ద స్నానం చేసేందుకు వీలుగా కనీసం గంటపాటు విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్తు అధికారులను ప్రజలు కోరేవారని గుర్తు చేశారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారికి జనవరి తర్వాత సామాజిక భద్రతా పింఛన్లు, రేషన్ కార్డులు అందజేస్తామని కేటీఆర్ తెలిపారు.

అలాగే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతి సిలిండర్‌పై పెంచిన ₹800ని బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రహిస్తుందనీ, పేద కుటుంబాల మహిళలకు డిసెంబర్ తర్వాత ₹400 గ్యాస్ సిలిండర్ అందిస్తామ‌ని పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్త ఎలా కత్తితో పొడిచాడో గుర్తుచేసుకున్న కేటీఆర్.. ఎన్నికల్లో డిపాజిట్ కూడా నిలుపుకోలేని విధంగా ఓటుతో పొడిచి వేయాలని ప్రజలను కోరారు.

బీఆర్‌ఎస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడం ప్రజల బాధ్యతగా పేర్కొన్న కేటీఆర్.. రాష్ట్రంలో తాము మెరుగైన పాల‌న అందిస్తున్నామ‌ని తెలిపారు. పార్టీ ఎన్నిక‌ల‌ వాగ్దానాలను ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలనీ, కాంగ్రెస్-బీజేపీలు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు (కేటీఆర్) పిలుపునిచ్చారు. కుటుంబంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయనీ, వాటిని అధిగమిస్తామని పార్టీ ప‌రిస్థితుల‌ను పేర్కొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios