సారాంశం

Telangana Assembly Election Result 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ లో  కాంగ్రెస్ జోరు కొన‌సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం కాంగ్రెస్ 63, బీఆర్ఎస్ 39, బీజేపీ 7, ఎంఐఎం 5 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి.

Telangana Assembly Election Result 2023: తెలంగాణ ఎన్నికల్లో కౌంటింగ్ లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేసీఆర్ బిగ్ షాక్ త‌గిలింది. బీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ తాను పోటీ చేస్తున్న రెండు చోట్ల వెనుకంజలో ఉన్నారు. 

కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో బ‌రిలో ఉండ‌గా, ప్ర‌స్తుతం అయ‌న వెనుకంజ‌లో ఉన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌పై బీజేపీ తరపున ఈటల రాజేందర్ అధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తూంకుంట నర్సారెడ్డి పోటీ చేయ‌గా, ఆయ‌న ప్ర‌స్తుతం మూడో స్థానంలో ఉన్నారు. 

ఇక కామారెడ్డి ఎన్నిక‌ల కౌంటింగ్ ఫ‌లితాలు గ‌మనిస్తే ఇక్క‌డ కూడా సీఎం కేసీఆర్ వెనుకంజ‌లో ఉన్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి రేవంత్ రెడ్డి అధిక్యంలో కొన‌సాగుతున్నారు.  బీజేపీ తరపున పోటీ చేస్తున్న‌ వెంకటరమణారెడ్డి మూడో స్థానంలో ఉన్నారు. 

తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్