ఓటర్ల జాబితాపై విచారణను అక్టోబర్ 31 వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.శుక్రవారం నాడు ఓటర్ల జాబితాపై  ఈసీ అఫిడవిట్ దాఖలు చేసింది.


హైదరాబాద్: ఓటర్ల జాబితాపై విచారణను అక్టోబర్ 31 వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.శుక్రవారం నాడు ఓటర్ల జాబితాపై ఈసీ అఫిడవిట్ దాఖలు చేసింది.

ఓటర్ల జాబితాలో అవకతవకలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం నాడు విచారించింది.
రెండు రోజుల క్రితం హైకోర్టు ఆదేశాల మేరకు ఈసీ హైకోర్టులో శుక్రవారం నాడు అఫిడవిట్ దాఖలు చేసింది. 

బూత్ లెవల్ ఓటర్ల జాబితాపై హైకోర్టులో ఈసీ పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసింది.అయితే ఈ విషయమై అఫిడవిట్ ప్రకారంగానే ఓటర్ల జాబితా ఉండాలని హైకోర్టు ఈసీకి సూచించింది. ఈ కేసు విచారణను అక్టోబర్ 31 వ తేదీకి వాయిదా వేసింది.

ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన తర్వాత కూడ ఓటర్ల జాబితాలో సవరణలు చేసే అవకాశాన్ని హైకోర్టు కల్పించింది. బోగస్ ఓట్లను ఏరివేయడంతో పాటు... కొత్త ఓటర్లను చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

అయితే ఈ ప్రక్రియను ఎలా చేస్తారనే విషయమై అఫిడవిట్‌ దాఖలు చేయాలని రెండు రోజల క్రితం ఈసీని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల ప్రకారంగా శుక్రవారం నాడు ఈసీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

సంబంధిత వార్తలు

తుది ఓటర్ల జాబితాలో కూడ సవరణలు: మర్రి శశిధర్ రెడ్డి

అసెంబ్లీ రద్దుపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

తెలంగాణ అసెంబ్లీ రద్దుపై 200 పిల్స్ దాఖలు

30 లక్షల బోగస్ ఓట్ల తొలగింపు: హైకోర్టులో ఈసీ కౌంటర్