హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలపై తప్పు జరిగిందని అంగీకరించారు విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి. ఫలితాల అవకతవకలపై త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదికను మీడియాకు వెల్లడించిన ఆయన హాల్ టిక్కెట్ల జారీ దగ్గరి నుంచి ఫలితాల వెల్లడి వరకు ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత ఇచ్చి వుంటే బాగుండేదని కమిటీ అభిప్రాయపడినట్లు తెలిపారు. 

గతంతో పోలిస్తే పబ్లిష్ చేసినపుడు కొన్ని తప్పులు దొర్లిన విషయాన్ని కమిటీ ఎత్తి చూపిందన్నారు. అంతేకాకుండా ఫలితాలు వెలువడిన రెండు గంటల్లోనే తప్పులను గుర్తించారని, 496 మంది విద్యార్థులకు సొంత సెంటరే పడిందని కమిటీ పేర్కొన్న విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. 

531 మంది జాగ్రఫీ స్టూడెంట్స్ మెమోలో ప్రాక్టికల్ మార్కులు కనిపించలేదని, చివరి నిమిషంలో సెంటర్ మార్పు వల్ల కొన్ని తప్పులు దొర్లాయని కమిటీ పేర్కొన్న విషయాన్ని స్పష్టం చేశారు. 

ఓఎంఆర్ షీట్‌ను సరిగా బబుల్ చేయకపోవడం వల్ల కొందరు ఫెయిల్ అయ్యారని, ఫస్టియర్‌లో 80 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చి, సెకండియర్‌లో ఫెయిల్ అయితే రీవెరిఫికేషన్ చేయాలని త్రిసభ్య కమిటీ సూచించిన విషయాన్ని మీడియాకు వెల్లడించారు. 

సాంకేతిక సమస్యతోనే 99 మార్కులకు గాను 00 మార్కులు పడ్డాయని, జంబ్లింగ్ విధానంలోనూ కొన్ని సమస్యలు తలెత్తినట్లు కమిటీ అభిప్రాయం పడిందన్నారు. అంతేకాకుండా సర్వర్ల సామర్థ్యాన్ని కూడా పెంచాలని కమిటీ తమకు సూచించిందని వెల్లడించారు. 

ఈ గందరగోళంపై మరో స్వతంత్ర సంస్థతో పునః పరిశీలించాలని కమిటీ చెప్పిందని తెలిపారు. ఇంటర్ ఫలితాల అవకతవకలపై బాధ్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే అధికారులు, ఏజెన్సీపై కూడా చర్యలు తీసుకుంటామని జనార్థన్ రెడ్డి స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

రీవాల్యూయేషన్ చెయ్యాల్సిందే: ఇంటర్ విద్యార్థులకు త్రిసభ్య కమిటీ శుభవార్త

నివేదిక అందింది, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: జనార్థన్ రెడ్డి

ఇంటర్ ఫలితాల వివాదంపై నివేదిక సమర్పించిన త్రిసభ్యకమిటీ