హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఇంటర్ ఫలితాల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఎట్టకేలకు నివేదిక సమర్పించింది. ఇంటర్ ఫలితాల్లో అవకతకవలు, గ్లోబరీనా సంస్థపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ కమిటీ అధ్యయనం చేసింది. 

అనంతరం శనివారం ఈ త్రిసభ్య కమిటీ 10 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. త్రిసభ్య కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు నేతృత్వంలోని బృందం నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. 

ఇంటర్ ఫలితాల అవకతవకలపై విచారణ చెయ్యడంతోపాటు భవిష్యత్ లో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేస్తూ నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. విచారణలో తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. నివేదికను ప్రభుత్వం పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

10 పేజీల నివేదికతోపాటు 46 పేజీల అనుబంధాలను కమిటీ అందజేసినట్లు తెలిపారు. నివేదిక సమర్పించే సమయంలో చైర్మన్ వెంకటేశ్వరరావుతోపాటు సభ్యుడు ప్రొ.నిశాంత్ కూడా ఉన్నారు.