మేడ్చెల్ డిఇఓ ఉషారాణిపై వేటు అవినీతి ఆరోపణలు రుజువు సస్పెండ్ చేసిన విద్యాశాఖ
మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఉషారాణి పై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతిలో కూరుకుపోయిన ఆమెను విద్యాశాఖ ఇంటికి పంపింది. డబ్బుల కోసం కక్కుర్తి పడడంతో ఆమె శిక్షకు గురైంది.
ఉషారాణిపై వచ్చిన అవినీతి ఆరోపనల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విచారణ జరిపించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ కిషన్ ను ఆదేశించారు. ఈమేరకు ఆయన విచారణ బాధ్యతలను ఆర్జెడి విజయలక్ష్మి బాయికకి అప్పగించారు. ఆమె అన్ని కోణాల్లో విచారణ జరిపారు. నివేదికను ప్రభుత్వానికి అందజేశారు.
ఉషారాణి డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె అవినీతికి పాల్పడ్డట్లు విచారణాధికారి విజయలక్ష్మి బాయి తన నివేదికను కిషన్ కు సమర్పించారు.
దీంతో ఆమెను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. మొత్తానికి విద్యాశాఖలో విచ్చలవిడి అవినీతి జరుగుతుందనడానిక ఈ ఘటన ఒక ఉదాహరణ మాత్రమే అని జనాలు అంటున్నారు.
