Telangana: సోమవారం ఉదయం హైదరాబాద్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆమె హైదరాబాద్ నుంచి బాసర చేరుకున్నారు. సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో మంగళవారం నుంచి తరగతులకు హాజరవుతామని విద్యార్థులు ప్రకటించారు.
Sabitha Indra Reddy: మంగళవారం ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఐఐఐటీ-బాసరలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. సబితా సోమవారం రాత్రి విద్యార్థులతో మాట్లాడి నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. దీంతో విద్యార్థులు తమ నిరసనలను విరమించాలని నిర్ణయించుకున్నారు. క్యాంపస్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ముఖ్యమంత్రికి వివరించారు. బాసర ఐఐఐటీ విద్యార్థులకు ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి ట్వీట్ చేశారు.
విద్యాశాఖ మంత్రి క్యాంపస్ పర్యటనతో పాటు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) డైరెక్టర్ సతీష్ కుమార్ మరియు ఇతర అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ ముష్రాఫ్ అలీ ఫరూఖీ మరియు అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే IIIT-బాసరకు వెళ్లారు. మంత్రి ఆమోదముద్ర వేసిన వెంటనే ఐఐఐటీ-బాసర నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్‌ను ఆరోగ్య శాఖ విద్యార్థులను తనిఖీ చేయడానికి ఉపయోగిస్తుంది. మహిళా విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ వారికి పౌష్టికాహార భోజనం అందించేలా చూస్తుంది. విద్యార్థుల హాజరు తప్పనిసరి అని, ఆరోగ్య శిబిరానికి రెవెన్యూ డివిజన్ అధికారి (ఆర్‌డీఓ) భైంసా లోకేశ్‌కుమార్ బాధ్యతలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు.
కాగా, అంతకుముందు, బాసర ట్రిపుల్ ఐటీలో వివిధ సమస్యలు పరిష్కరించాలని, రెగ్యులర్ వీసీని నియమించాలనే డిమాండ్లతో వారం రోజులుగా స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నారు. ఆహారం, ఇతర ప్రాథమిక సౌకర్యాల నాణ్యతను మెరుగుపరచాలని వారు డిమాండ్ చేశారు. ఎండ, వానను లెక్కచేయకుండా క్యాంపస్‌లో కూర్చొని నిరసన చేపట్టారు. మరోవైపు స్టూడెంట్స్‌తో జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి , కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖి, ఎస్పీ ప్రవీణ్ కుమార్పలు దఫాలుగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి కార్యాలయం లేదా విద్యాశాఖ మంత్రి నుంచి రాతపూర్వక హామీ ఇవ్వాలని విద్యార్థులు పట్టుబట్టారు. సోమవారం ఏడో రోజూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. ప్రధాన గేటు వద్ద నిరసనను కొనసాగించారు. వర్షం కురుస్తున్నప్పటికీ గొడుగులు పట్టుకుని మరి నిరసన కొనసాగించారు.
అర్ధరాత్రి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చలు సఫలం కావడంతో.. విద్యార్థులు ఆందోళనను విరమించారు. సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇవ్వడంతో మంగళవారం నుంచి తరగతులకు హాజరవుతామని విద్యార్థులు ప్రకటించారు. సోమవారం ఉదయం హైదరాబాద్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆమె హైదరాబాద్ నుంచి బాసర చేరుకున్నారు. ఆమె వెంట నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, బాసర ట్రిపుట్ ఐటీ ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ రాహుల్ బొజ్జా, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకట్ రామన్న, బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీష్ కుమార్, విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ, పోలీసు సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్, స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఉన్నారు. రాత్రి 9.30 గంటల తర్వాత రెండున్నర గంటలకు పైగా విద్యార్థులతో చర్చలు జరిపారు.