తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో రాజకీయ పార్టీల కార్యకలాపాలపై ఈసీ ఓ కన్నేసింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి ఉళ్లంఘనలు జరక్కుండా కట్టుదిట్టంగా వ్యవహరింస్తోంది.  ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం, సభలు ఇలా ఏ విషయంపై ఫిర్యాదులు వచ్చినా ఈసీ అధికారులు వెంటనే స్పందిస్తున్నారు.

ఇలా తాజాగా ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదు మేరకు అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇలా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చాక తొలిసారి ఈసీ ఓ రాజకీయ పార్టీకి అందులోనూ అధికార పక్షానికి నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో గల క్లబ్ హౌస్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన ఈ ప్రాంతంలో పార్టీ సమావేశాలు ఎలా నిర్వహిస్తారంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఇలా అధికార పార్టీ నేతలు ఎన్నికల నియమాలను ఉళ్లంగిచారంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీ జనరల్‌ సెక్రటరీ కేశవరావుకు నోటీసులు జారీ చేసింది. ఆయన సమాధానాన్ని బట్టి చర్యలు తీసుకుంటామని ఈసీ తెలిపింది.