గురువారం ఉదయం 11 గంటలకు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు.
ఎల్లుండి తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 11 గంటలకు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. కాగా.. ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు జరిగాయి. మొత్తం 94.11 శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈసారి ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ నిబంధనను ఎత్తివేశారు. అలాగే ప్రాథమిక కీని కూడా ఇప్పటికే విడుదల చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
Add Asianetnews Telugu as a Preferred Source

