Asianet News TeluguAsianet News Telugu

Singareni:  సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పోస్టులు ఎన్నంటే.. ?

Singareni: తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి మల్లు భ‌ట్టి విక్ర‌మార్క..సింగ‌రేణి అభివృద్ది, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై ఆ సంస్థ ఛైర్మ‌న్ అండ్ ఎండీ (సీఎండీ)ఎన్ బ‌ల‌రామ్‌, డైరెక్ట‌ర్(ప‌ర్స‌న‌ల్‌) ఎన్‌వీకే శ్రీ‌నివాస్‌ల‌తో బుధ‌వారం రాష్ట్ర స‌చివాల‌యంలో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.  ఈ క్రమంలో సింగరేణి కాలరీస్‌లో ఖాళీగా ఉద్యోగాల భర్తీపై కీలక చర్చ జరిగింది. 
 

Telangana Dy CM Bhatti asks Singareni to fill 485 vacancies KRJ
Author
First Published Feb 22, 2024, 5:25 AM IST

Singareni:  తెలంగాణలోని నిరుద్యోగులకు సింగరేణి సంస్థ శుభవార్త చెప్పింది. సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టుల‌కు, అలాగే 168 ఇంటర్నల్ రిక్రూట్‌మెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్దమైంది. ఈ మేరకు ఈ పోస్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేష‌న్లు సిద్దం చేయాల‌ని రాష్ట్ర‌ ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. సింగరేణి ఛైర్మన్ అండ్‌ ఎం.డీ బలరామ్ నాయ‌క్‌ను ఆదేశించారు. సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియను వేగంగా చేపట్టాలని, ఈ ఏడాదిలో కనీసం వెయ్యి మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాల‌న్నారు. 

వివరాల్లోకెళ్తే..  సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఆభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలపై బుధవారం సచివాలయంలో అధికారులతో డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సింగ‌రేణి ఛైర్మ‌న్ అండ్ ఎండీ (సీఎండీ)ఎన్ బ‌ల‌రామ్‌, డైరెక్ట‌ర్(ప‌ర్స‌న‌ల్‌) ఎన్‌వీకే శ్రీ‌నివాస్‌ల‌తో చర్చించారు. సమావేశంలో  సింగరేణి కాలరీస్‌లో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టుల‌కు, అలాగే 168 ఇంటర్నల్ రిక్రూట్‌మెంట్ పోస్టులకు తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేష‌న్లు సిద్దం చేయాల‌ని సంస్థ సీఎండీ బలరామ్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఉద్యోగ నియామక ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని, ప‌రీక్ష‌ల్లో ఏలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. 

అదే సమయంలో సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియను వేగంగా చేపట్టాలని, ఈ ఏడాదిలో కనీసం వెయ్యి మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాల‌ని సూచించారు. అలాగే.. వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచే అంశంపై వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ క్రమంలోనే సింగరేణిలో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్, 168 ఇంటర్నల్ పోస్టులకు నేడు (ఫిబ్రవరి 22న) నోటిఫికేషన్లను జారీ చేయనున్నట్టు ఆ సంస్థ సీఎండీ బలరామ్ వెల్లడించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios