Asianet News TeluguAsianet News Telugu

దసరాతో తెలంగాణకు మద్యం కిక్కు: వారం రోజుల్లో రూ.1128 కోట్ల లిక్కర్ సేల్స్

దసరాను పురస్కరించుకొని వారం రోజుల్లో రూ. 1128 కోట్ల విలువైన మద్యం విక్రయాలు సాగినట్టుగా జరిగాయి.  ప్రతి రోజూ సగటున రూ. 165 కోట్ల విలువైన మద్యం విక్రయాలు సాగాయి. 
 

Telangana Dussehra liquor Sales  Crosses Rs. 1128 Crore
Author
First Published Oct 7, 2022, 1:24 PM IST

హైదరాబాద్: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని వారం రోజుల్లో రూ. 1128 కోట్ల విలువైన మద్యం విక్రయాలు సాగినట్టుగా ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దసరాకు ముందు రోజు తర్వాతి రోజున మద్యం విక్రయాలు ఎక్కువగా సాగినట్టుగా అధికారులు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25 నుండి ఈ నెల 4వ  తేదీ వరకు  మద్యం డిపోల నుండి వైన్స్  దుకాణాలకు పెద్ద ఎత్తున మద్యం  సరఫరా అయింది. 

తెలంగాణలో దసరాపండుగను ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. దసరా రోజున మద్యం, మాంసం విక్రయాలు జోరుగా సాగుతాయి. దసరా రోజున మద్యం విక్రయాలు ఎక్కువగా సాగుతాయి. దసరాను పురస్కరించుకొని మద్యం దుకాణాలకు పెద్ద ఎత్తున మద్యాన్ని సరఫరా చేశారు. గ్రామాల్లోని  బెల్ల్ షాపుల ద్వారా మద్యం దుకాణాల  యజమానులు భారీ గా మద్యాన్ని విక్రయించారు.

గత నెల 25 నుండి ఈ నెల 4వ తేదీ వరకు మద్యం డిపోల నుండి రూ. 1320 కోట్ల మద్యం సరఫరా అయింది. ఈ నెల 3న రూ. 138 కోట్లు,4న 192 కోట్లు, సెప్టెంబర్ 30న  ఒక్క రోజే రూ. 313.64 కోట్ల మద్యం సరఫరా జరిగింది. సెప్టెంబర్ 25,ఈ నెల 2న మిహహాయించి  రోజుకు సగటును రూ. 165 కోట్ల మద్యం విక్రయాలు సాగాయి. 

రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రూ. 500 కోట్ల మద్యం విక్రయాలు సాగాయని ఎక్సైజ అధికారులు తెలిపారు.
వరంగల్ అర్బన్ లో  రూ. 149 కోట్లు, నల్గొండలో రూ. 294కోట్లు, కరీంనగర్ లో రూ. 111 కోట్లు, హైదరాబాద్ లో రూ. 108 కోట్ల మద్యం వ్యాపారం సాగింది. గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన రూ. 171.17  కోట్లు సరఫరా అయింది.  మద్యం విక్రయాల ద్వారా వారం రోజుల్లోనే తెలంగాణ  ప్రభుత్వానికి రూ. 928 కోట్ల ఆదాయం లభించింది.  ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటివరకు లిక్కర్ విక్రయాల ద్వారా రూ. 26 వేల కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.  దసరా రోజున మాత్రం మద్యం  కంటే  బీర్ల విక్రయాలు సాగాయని అధికారులు చెబుతున్నారు. దసరాకు ముందు బీర్ల కంటే మద్యం విక్రయాలు ఎక్కువగా ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios