Asianet News TeluguAsianet News Telugu

మెయిన్‌ రోడ్‌లే కాదు, గల్లీల్లోనూ తిరగండి.. పోలీసులకు తెలంగాణ డీజీపీ ఆదేశాలు

రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌పై తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సీపీ, ఐజీ, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని డీజీపీ ఆదేశించారు. 

telangana dgp mahender reddy review on lockdown ksp
Author
Hyderabad, First Published May 19, 2021, 8:38 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌పై తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సీపీ, ఐజీ, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని డీజీపీ ఆదేశించారు.

జిల్లాల వారీగా సీఎం కేసీఆర్‌ ప్రతిరోజూ సమీక్షిస్తున్నారని... ప్రజలు ఒక్కసారిగా నిత్యావసరాల కోసం బయటకు వస్తున్నారని, దీంతో మార్కెట్లు, దుకాణాల వద్ద రద్దీ ఏర్పడుతోందని మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉదయం 6 గంటల నుంచే మినహాయింపులు ఉన్నా జనం మాత్రం 8 గంటలకు బయటకు వస్తున్నారని డీజీపీ తెలిపారు.

Also Read:తెలంగాణ: కొత్త కేసుల్లో తగ్గుదల.. 25 మంది మృతి, జీహెచ్ఎంసీలో అదే తీవ్రత

లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేసేందుకు కమిషనర్‌ నుంచి ఏసీపీ స్థాయి అధికారి వరకు స్వయంగా పర్యవేక్షించాలని మహేందర్ రెడ్డి సూచించారు. చేపలు, కూరగాయల మార్కెట్ల వద్ద జనం గుమిగూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ఉదయం 10 గంటల తర్వాత బయటకు వచ్చే వాళ్ల వాహనాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ప్రధాన రహదారులపైనే కాకుండా నగరంలోని అంతర్గత రహదారులు, కాలనీలపైనా దృష్టి పెట్టాలని సూచించారు. పోలీసులు గస్తీ వాహనాల్లో సైరన్‌ శబ్దం చేస్తూ కాలనీల్లో సంచరించాలని డీజీపీ ఆదేశించారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios