Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో పెరిగిన క్రైమ్ రేట్: పోలీస్ వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ మహేందర్ రెడ్డి

గత ఏడాదితో పోలిస్తే  క్రైమ్ రేట్  4.44 శాతం పెరిగిందని  తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి  చెప్పారు. ఇవాళ పోలీస్ శాఖ వార్షిక నివేదికను  డీజీపీ విడుదల చేశారు. 
 

Telangana DGP Mahender Reddy  Releases   Police  Annual Report
Author
First Published Dec 29, 2022, 2:31 PM IST

హైదరాబాద్: రాష్ట్రంలో  సైబర్ నేరాలు 57 శాతం పెరిగినట్టుగా  తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి  చెప్పారు. రాష్ట్ర పోలీస్ శాఖ  వార్షిక నివేదిక ను తెలంగాణ డీజీపీ  మహేందర్ రెడ్డి  గురువారంనాడు  విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో  మాట్లాడారు. రాష్ట్రంలో  నేరాల శాతం గత ఏడాదితో పోలిస్తే  4.44 శాతం పెరిగినట్టుగా  డీజీపీ చెప్పారు. సైబర్ నేరాల పెరుగుదలతో  క్రైమ్ రేటు  4.44 శాతం పెరిగినట్టుగా  డీజీపీ చెప్పారు. 

హత్య కేసులు  12 శాతం,అత్యాచారాలు, 17 శాతానికి తగ్గినట్టుగా  డీజీపీ వివరించారు. దొంగతనాలు  7 శాతం,కిడ్నాప్ లు  15 శాతం పెరిగాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.. మహిళలపై నేరాలు  33 శాతం పెరిగాయన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా  నమోదైన 152 కేసుల్లో  నిందితులకు జీవిత ఖైదు పడిందని  డీజీపీ వివరించారు. డయల్ 100 ద్వారా  13 లక్షల ఫిర్యాదులు వచ్చాయన్నారు. పోలీస్ శాఖకు చెందిన  సోషల్ మీడియా ద్వారా  1.1 లక్షల ఫిర్యాదులు అందాయన్నారు. పోలీస్ స్టేషన్ లలో  5.5 లక్షల ఫిర్యాదులు అందినట్టుగా  డీజీపీ చెప్పారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు  కార్యక్రమాలను  నిర్వహిస్తున్నామన్నారు.. సైబర్ నేరాలపై  15 లక్షల మందికి అవగాహన కల్పిస్తున్నట్టుగా  చెప్పారు. గస్తీ వాహనాలు  7 నిమిషాల్లో సంఘటన స్థలానికి  చేరుకుని   సహాయం అందిస్తున్నాయని  డీజీపీ చెప్పారు.  హక్ ఐ ద్వారా ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. 

ప్రజల భాగస్వామ్యంలో  10 లక్షలకు పైగా సీసీ కెమెరాల ఏర్పాటు చేసినట్టుగా  చెప్పారు.సీసీ కెమెరాల ద్వారా  18,234 కేసులు చేధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఎందరో నేరస్తులను గుర్తించినట్టుగా  డీజీపీ తెలిపారు.10 లక్షల మంది అనుమానితుల వేలిముద్రలను  సేకరించినట్టుగా  డీజీపీ చెప్పారు.కరుడు గట్టిన నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించామన్నారు. 

2022లో  తెలంగాణలో మూడు ఎన్ కౌంటర్లు జరిగాయి.ఈ ఎన్ కౌంటర్లలో  ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని  ఆయన చెప్పారు. ఈ ఏడాది  120 మంది మావోయిస్టులు  లొంగిపోయారన్నారు.  మావోయిస్టు రహిత  రాష్ట్రంగా తెలంగాణను తయారు చేసినట్టుగా  డీజీపీ  మహేందర్ రెడ్డి వివరించారు. తెలంగాణలో  పట్టు సాధించేందుకు  మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలను  ఎప్పటికప్పుడు తిప్పికొట్టినట్టుగా  డీజీపీ ఈ సందర్భంగా  ప్రస్తావించారు.

Follow Us:
Download App:
  • android
  • ios