Asianet News TeluguAsianet News Telugu

లీవ్‌లో మహేందర్ రెడ్డి.. తెలంగాణ డీజీపీగా అంజనీ కుమార్‌‌‌కు అదనపు బాధ్యతలు

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి ఎడమ భుజంలో శస్త్రచికిత్స కారణంగా మెడికల్ లీవ్‌లో వెళ్తున్నారు. దీంతో మహేందర్ రెడ్డి స్థానంలో పూర్తి అదనపు బాధ్యతలను అంజనీ కుమార్‌కు (anjani kumar) అప్పగించింది ప్రభుత్వం.

telangana dgp mahender reddy on medical leave
Author
Hyderabad, First Published Feb 18, 2022, 10:13 PM IST

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి (telangana dgp mahender reddy ) మెడికల్ లీవ్‌లో (medical leave) వెళ్లనున్నారు. ఈ నెల 18 నుంచి ఆయన మెడికల్ లీవ్‌లో వెళ్తున్నారు. దీంతో మహేందర్ రెడ్డి స్థానంలో పూర్తి అదనపు బాధ్యతలను అంజనీ కుమార్‌కు (anjani kumar) అప్పగించింది ప్రభుత్వం. డీజీపీ మహేందర్ రెడ్డికి ఎడమ భుజంలో శస్త్రచికిత్స కారణంగా మెడికల్ లీవ్‌లో వెళ్తున్నారు. 

కాగా.. తెలంగాణ ప్ర‌భుత్వం గతేడాది డిసెంబర్‌లో భారీగా ఐపీఎస్‌ల బ‌దిలీలు చేప‌ట్టిన సంగతి తెలిసిందే.  30 మంది ఐపీఎస్‌ అధికారులను ట్రాన్స్‌ప‌ర్స్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. అందులో భాగంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ను ఏసీబీ డీజీగా నియమించారు. ఆయన స్థానంలో సీవీ ఆనంద్‌ హైదరాబాద్‌ సీపీగా వ‌చ్చారు. ఏసీబీ డైరెక్టర్‌గా షిఖా గోయల్‌, హైదరాబాద్‌ సంయుక్త సీపీగా ఏఆర్‌ శ్రీనివాస్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ సంయుక్త సీపీగా ఏవీ రంగనాథ్‌, నల్గొండ ఎస్పీగా రెమా రాజేశ్వరి, సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌గా ఎన్‌.శ్వేత, హైదరాబాద్‌ పశ్చిమ మండల డీసీపీగా జోయల్‌ డెవిస్‌, హైదరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌గా కార్తికేయ, మెదక్‌ ఎస్పీగా రోహిణి ప్రియదర్శిని, సైబరాబాద్‌ క్రైం డీసీపీగా కమలేశ్వర్, సైబరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌గా అవినాష్‌ మొహంతి, హైదరాబాద్‌ ఉత్తర మండల డీసీపీగా చందనా దీప్తి, హైదరాబాద్‌ డీసీపీగా గజరావు భూపాల్‌, హైదరాబాద్‌ ఎస్‌బీ జాయింట్‌ కమిషనర్‌గా పి. విశ్వప్రసాద్‌, మహబూబాబాద్‌ ఎస్పీగా శరత్‌ చంద్ర పవార్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా ఎన్‌.ప్రకాశ్‌రెడ్డిని బదిలీ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios