Asianet News TeluguAsianet News Telugu

రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు: అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేసిన భట్టి

తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క  బుధవారంనాడు శ్వేత పత్రం విడుదల చేసింది.  

Telangana Deputy Chief Minister  Mallu Bhatti Vikramarka Realeases white paper on  Financial status lns
Author
First Published Dec 20, 2023, 12:10 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై  తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క  బుధవారంనాడు శ్వేత పత్రం విడుదల చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో  42 పేజీల శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై  స్వల్పకాలిక చర్చను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు.  

అయితే  శ్వేతపత్రంపై అవగాహన కోసం అధ్యయనం చేసేందుకు కనీసం సమయం ఉండాల్సిన అవసరం ఉందని  భారత రాష్ట్ర సమితి,  ఎంఐఎం,  సీపీఐ సభ్యులు  కనీసం  అరగంట పాటైనా అధ్యయనం కోసం సమయం ఇవ్వాలని కోరారు. దీంతో  సభను అరగంట పాటు  వాయిదా వేశారు. 

రాష్ట్రం మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.  2014-15 నాటికి రాష్ట్రం రూ. 72,658 కోట్లుగా ఉందని తెలిపింది.  2014-22 మధ్య సగటున 24.5 శాతం అప్పులు పెరిగినట్టుగా ప్రభుత్వం వివరించింది. 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ. 3,89,673 కోట్లుందని పెరిగింది. 2015-16 లో రుణ, జీఎస్‌డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పంగా ఉందని  ప్రభుత్వం తెలిపింది.

2014-23 మధ్య బడ్జెట్ కేటాయింపుల్లో వాస్తవ వ్యయం  82.3 శాతమే ఉందని ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు రుణ భారం పెరిగిందని  ప్రభుత్వం తెలిపింది. రెవిన్యూ రాబడిలో  34 శాతానికి రుణ చెల్లింపుల భారం పెరిగిందని  ప్రభుత్వం వివరించింది.రెవిన్యూ రాబడిలో ఉద్యోగుల జీతాలకు 35 శాతం వ్యయం  పెరిగిందని  తెలిపింది. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ 2022 నాటికి అప్పుల రాష్ట్రంగా మారిందని ప్రభుత్వం తెలిపింది.బడ్జెటేతర రుణాలు పేరుకుపోయి అప్పుల ఊబిలో తెలంగాణ కూరుకుపోయిందని ప్రభుత్వం వివరించింది.  ఆర్ధిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తామని  ప్రభుత్వం తెలిపింది.

ఈ నెల  7వ తేదీన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై అన్ని శాఖల నుండి శ్వేత పత్రం విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో  రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై  ప్రజలకు వివరించాలనే ఉద్దేశ్యంతో  శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios