Hyderabad: ప్రస్తుత నీటి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల కృష్ణా జలాల వినియోగాన్ని లెక్కించి, రెండు రాష్ట్రాలు వాస్తవంగా నీటి వినియోగాన్ని నిర్ణయించాలని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. 

Krishna Water-Telangana: కృష్ణా జ‌లాల గురించి చాలా కాలంగా స‌మ‌స్య‌లు ఉన్నాయి. నీటి వినియోగానికి సంబంధించి వాస్త‌వంగా ద‌క్కాల్సిన వాటా త‌మ‌కు ద‌క్క‌డం లేద‌ని తెలంగాణ రాష్ట్రం పేర్కొంటోంది. ఈ క్ర‌మంలోనే ఈ ఏడాదికి సంబంధించి కృష్ణా జ‌లాలా వాడ‌కం విష‌యంలో కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ముందు ప‌లు డిమాండ్ల‌ను ఉంచింది. అందులో ఒక‌టి ఈ ఏడాదికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల కృష్ణా జలాల వినియోగాన్ని లెక్కించి, రెండు రాష్ట్రాలు వాస్తవంగా నీటి వినియోగాన్ని నిర్ణయించాలని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది.

వివ‌రాల్లోకెళ్తే.. ప్రస్తుత నీటి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కృష్ణా జలాల వినియోగాన్ని లెక్కించి, రెండు రాష్ట్రాలు వాస్తవంగా నీటి వినియోగాన్ని నిర్ణయించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ను తెలంగాణ ప్రభుత్వం కోరింది. కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ ముందు తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ శుక్రవారం ప్రభుత్వ వాదనలు వినిపించారు. రెండు రాష్ట్రాలు నీటి వినియోగాన్ని లెక్కించడం ద్వారా వాస్తవంగా ప్రతి ఒక్కరు ఎంత నీటిని వినియోగించుకున్నారో, ఎంత వినియోగించుకోవాల్సి వచ్చిందో తెలుసుకోవచ్చని చెప్పారు. నీటి వినియోగం విష‌యంలో తెలంగాణ‌కు న్యాయంగా ద‌క్కాల్సిన వాటాలు ద‌క్క‌డం లేద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. 

ప్రస్తుత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే తన కోటాకు మించి కృష్ణా జలాలను వాడుకున్నట్లు ఇరిగేషన్ అధికారి బోర్డు దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణకు ఇంకా 141 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉండగా, తెలంగాణ వాదనల అనంతరం ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి గైర్హాజరు కావడంతో కమిటీ సమావేశాన్ని వాయిదా వేసింది. తదుపరి సమావేశం మార్చిలో జరిగే అవకాశం ఉందని కమిటీ సభ్యులు తెలిపారు. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ అధికంగా వాడుకుంటున్న విషయాన్ని తెలంగాణ లేవనెత్తుతోందని, మరిన్ని కేటాయింపులతో భర్తీ చేయాలని డిమాండ్ చేసింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాత్రం తెలంగాణ వాదాన‌ల‌ను ఖండిస్తోంది. ఇదివ‌ర‌క‌టి కేటాయింపుల్లో మార్పులు చేయాల‌ని డిమాండ్ చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 50:50 శాతం నిష్పత్తిలో కృష్ణా జలాలను కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఇదే స‌మ‌యంలో ఈ నిష్పత్తిని 70:30 శాతానికి సవరించాలని ఏపీ పట్టుబట్టింది. కాగా, మార్చిలో జ‌రిగి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) స‌మావేశంలో దీనిపై కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశ‌ముంది. కాగా, శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి విద్యుత్‌, నీటిని పంచుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య వాద‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. గ‌త డిసెంబ‌ర్ లో కృష్ణా జలాలపై కేఆర్‌ఎంబీ ఆలోచనను తెలంగాణ ప్ర‌భుత్వం తిరస్కరించిన సంగ‌తి తెలిసిందే.