హైదరాబాద్:  గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది  రాష్ట్రంలో క్రైమ్ రేటు ఆరు శాతం తగ్గిందని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు.

బుధవారం నాడు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి  హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్రంలో క్రైమ్ రేట్ గురించి ఆయన వివరించారు.

  నాలుగు కేసుల్లో నేరస్తులకు కోర్టులు మరణశిక్షలు విధించాయని ఆయన గుర్తు చేశారు. 350 మందిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామన్నారు.161 మంది మహిళలు హత్యకు గురయ్యారని ఆయన చెప్పారు.

ఈ ఏడాది రాష్ట్రంలో 1934 రేప్ కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. 161 మంది హత్యకు గురయ్యారన్నారు.682 మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని ఆయన వివరించారు.

మహిళలపై వేధింపులు గత ఏడాదితో పోలిస్తే 1.92 శాతం తగ్గాయన్నారు. సీసీ కెమెరాల ద్వారా 4,490 కేసులను చేధించినట్టుగా ఆయన చెప్పారు. జీరో ఎఫ్ఐఆర్ కింద 624 కేసులు నమోదు చేశామన్నారు.

ఎంసెట్ కేసులో చార్జీషీట్ దాఖలు చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేసులో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టుగా చెప్పారు.

నయీమ్ కేసులో చట్టపరంగా  చర్యలు తీసుకొంటామన్నారు. ఆన్ లైన్ లోన్ యాప్ప్ వేధింపులకు చెక్ పెట్టామన్నారు. ఈ లోన్ యాప్స్ కేసులో ఇప్పటికే 27 మందిని అరెస్ట్ చేసినట్టుగా డీజీపీ తెలిపారు.