Telangana: భార్యను తమ బంధువుల వేడుకలకు పిలిస్తే రాలేదని మనస్తాపానికి గురైన భర్త.. వీడియో కాలు చేసి.. లైవ్ లోనే ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ ప్రాంత పరిధిలో చోటుచేసుకుంది.
Hyderabad Crime: భార్యాభర్తల మధ్య మాటల యుద్ధాలు, గొడవలు జరగడం సర్వ సాధారణమే. అయితే, ఇటీవలి కాలంలో వాటిని సీరియస్ గా తీసుకుని ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే భార్యను తమ బంధువుల వేడుకలకు పిలిస్తే రాలేదని మనస్తాపానికి గురైన భర్త.. వీడియో కాలు చేసి.. లైవ్ లోనే ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ ప్రాంత పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. తన బంధువుల వేడుకకు పిలిస్తే భార్య రాలేదని మనస్తాపానికి గురైన భర్త.. వీడియో కాల్ చేసి.. లైఊవ్ లోనే ఊరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఓ ప్రయివేటు కంపెనీలు పనిచేస్తున్న మృతుడు (33 ఏళ్ల) పహాడిషరీఫ్ లోని తన నివాసంలో ఉరివేసుకుని ప్రానాలు తీసుకున్నాడు. ఆదివారం నాడు ఇంట్లో తన భార్యతో వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పహాడిషరీఫ్‌లోని తుక్కుగూడకు చెందిన సాయి కార్తీక్‌గౌడ్‌గా గుర్తించారు. ఆగస్టు 12న గౌడ్ తన భార్య రవళితో కలిసి కందుకూరు బేగంపేట గ్రామంలోని బంధువుల ఇంటికి వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లాడు. కార్యక్రమం ముగిసిన తర్వాత, రవళి తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఉండిపోయింది. అయితే, కార్తీక్ గౌడ్ మాత్రం తిరిగి ఇంటికి వచ్చాడు.
ఆదివారం నాడు కార్తీక్ గౌడ్.. రవళికి ఫోన్ చేసి మీర్‌పేటలోని తన అత్త ఇంట్లో జరిగే కుటుంబ వేడుకలు జరుపుకునేందుకు రావాలని కోరాడు. రవళి రావడానికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన కార్తీక్ గౌడ్ ఇంటికి వెళ్లి ఆమెతో వీడియో కాల్ మాట్లాడుతూ.. లైవ్ లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. రవళి ఇంటికి చేరుకునే సరికి గౌడ్ ఉరి వేసుకుని మృతి చెందాడు. పోలీసులు సిఆర్‌పిసి సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. అయితే, కార్తీక్ గౌడ్ ఆత్మహత్య గురించి తెలిసిన వెంటనే భార్య పక్కింటి వారికి, వారి బంధువులకు కాల్ చేసింది. వెంటనే ఆమె అక్కడికి బయలు దేరింది. అయితే, అప్పటికే కార్తీక్ గౌడ్ ప్రాణాలు కోల్పోయాడు.
ఇదిలావుండగా, జనగామ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీవీడియో తీసుకుని తన మరణానికి గల కారణాన్ని వివరించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పాలకుర్తి మండలం బిక్యా నాయక్ తండాలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన.. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బిక్యానాయక్ తండాకు చెందిన గగులోతు రాజు (20), బానోతు దీపిన (16) ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అయితే, తమ పెళ్లికి ఎవరూ అంగీకరించరని వారిలో వారే మదన పడిపోయారు. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ క్షణికావేశంలో ఇద్దరూ కలిసి సెల్ఫీ వీడియో తీసుకుని తాము చనిపోతున్నట్లు గా ప్రకటించారు. ఆ వెంటనే ఇద్దరూ కలిసి తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగారు. దీంతో యువతీయువకులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
