తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 42,461 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో కొత్తగా 463 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,07,205 కు చేరింది.

తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 42,461 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో కొత్తగా 463 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,07,205 కు చేరింది.

ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 1694కు చేరింది. 

కరోనా బారి నుంచి నిన్న 364 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,00,833కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 4,678 యాక్టివ్ కేసుల్లో.. 1,723 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు, జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 145 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 1,00,95,487కి చేరింది.