తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టినట్టే పట్టి మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 59,471 టెస్టులు చేశారు. వీటిలో కొత్తగా 596 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ కేసులతో కలిసి రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసులు 2,72,719కి చేరింది. 

కరోనా మృతులు సంఖ్యలోనూ ఈ పెరుగుదల కనిపిస్తుంది. గడిచిన 24 గంటల్లో కరోనా చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,470కి చేరింది. తాజాగా కరోనా నుంచి మరో 972మంది కోలుకున్నారు.

దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 2,62,751కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,498 క్రియాశీల కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో 6,465 మంది ఉన్నారు. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 102 కేసులు నమోదయ్యాయి.