ఎన్నికలకు సిద్ధమవుతోన్న టీ.కాంగ్రెస్.. ‘‘తిరగబడదాం - తరిమికొడదాం’’నినాదంతో జనంలోకి
తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహంపై శనివారం చర్చించారు.
తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్, ఈసారి ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ , బీజేపీలు రెడీ అవుతున్నాయి. అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత టీ. కాంగ్రెస్‌లో ఒక్కసారిగా జోష్ వచ్చింది. దీనికి తోడు చేరికలతో ఆ పార్టీ కేడర్ ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహంపై శనివారం చర్చించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్-బీజేపీ తోడు దొంగలని కరపత్రాలు ముద్రించాలని నిర్ణయించారు. అలాగే ప్రజా కోర్టుల పేరుతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. తిరగబడదాం, తరిమికొడదాం అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని ఫిక్స్ అయ్యారు.