పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ ప్రభుత్వం ఎక్కువ నీటిని తరలించే ప్రయత్నం చేస్తోందన్నారు టీ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. మంగళవారం నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతల అరెస్ట్ నేపథ్యంలో ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిపక్షాలను అణిచివేయాలని చూస్తోందని జానారెడ్డి ఆరోపించారు.

Also Read:జలదీక్ష: ఎక్కడికక్కడ తెలంగాణ కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్టు

అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాలను చులకన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వెంటనే సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తామని చెప్పి... ఎల్‌ఎల్‌బీసీ పనులు చేయడం లేదని తేల్చిచెప్పారు. ప్రాజెక్టులను సందర్శించి ప్రభుత్వానికి నివేదిక ఇద్దామనుకున్నామన్నామని జానారెడ్డి చెప్పారు.

కానీ మమ్మల్ని అరెస్ట్ చేసి.. రాక్షసానందం పొందారని ఆయన దుయ్యబట్టారు. ఎల్ఎల్‌బీసీ టన్నెల్ పనులు ఎందుకు ఆగిపోయాయని జానారెడ్డి ప్రశ్నించారు. 33 కిలోమీటర్ల టన్నెల్‌ను మా హయాంలో పూర్తి చేశామని... టీఆర్ఎస్ వచ్చాక 10 కిలోమీటర్లు కూడా తవ్వలేదని ఆయన ఎద్దేవా చేశారు.

Also Read:అబద్ధాలు, దబాయింపులే: జగదీశ్‌తో వివాదం నేపథ్యంలో ఉత్తమ్ వ్యాఖ్యలు

కృష్ణాపై ప్రాజెక్టుల్ని కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు. ప్రాజెక్ట్‌ల సందర్శనకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకున్నారని ఆయన ప్రశ్నించారు.