దివంగత పీజేఆర్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన విందుకు పలువురు కాంగ్రెస్ సినీయర్ నేతలు హాజరయ్యారు. వారిలో వీ హనమంతరావు, శ్రీధర్ బాబు, మధుయాష్కిలతో పాటు తదితరులు కూడా ఉన్నారు.
దివంగత పీజేఆర్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన విందుకు పలువురు కాంగ్రెస్ సినీయర్ నేతలు హాజరయ్యారు. వారిలో వీ హనమంతరావు, శ్రీధర్ బాబు, మధుయాష్కిలతో పాటు తదితరులు కూడా ఉన్నారు. తన సోదరి విజయరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని విష్ణువర్దన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేని విష్ణువర్దన్ రెడ్డి.. కొందరు సీనియర్లను మాత్రమే లంచ్‌కు పిలవడం తీవ్ర చర్చనీయాంవంగా మారింది. మరోవైపు కొద్ది రోజులుగా టీ కాంగ్రెస్ నేతల మధ్య మరోసారి విభేదాలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
విష్ణువర్దన్ రెడ్డి ఇంటికి వచ్చిన వీహెచ్, మధుయాష్కి, శ్రీధర్ బాబులు విందు భోజనం చేశారు. అనంతరం వీహెచ్, మధుయాష్కిలు మీడియాతో మాట్లాడారు. విష్ణువర్దన్ రెడ్డి పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. పీజేఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. పీజేఆర్ కొడుకు విష్ణువర్దన్ రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. రేవంత్‌ను టీపీసీసీ చీఫ్‌గా సోనియా గాంధీ నియమించారని.. ఆయన అందరిని కలుపుకుపోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు. అందరూ కలిసి ఉంటేనే పార్టీ నిలబడుతుందని చెప్పారు. తన ఇష్యూపై అధిష్టానంతో మాట్లాడతానని చెప్పారు.
మరోవైపు తనకు టీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని విష్ణువర్దన్ రెడ్డి మంగళవారం మీడియాకు చెప్పారు. రేవంత్ రెడ్డి ఉండడం వల్ల ఇవాళ తాను నిర్వహించిన సమావేశానికి రావడం లేదన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న కాంగ్రెస్ పార్టీల నేతలను తాను పిలిచిన లంచ్ భేటీకి రానున్నారని చెప్పారు. తన సోదరి పార్టీలో చేరే విషయమై పార్టీ నేతలు ఎవరూ కూడా తనతో చర్చించలేదన్నారు. తన సోదరి విషయంలో పార్టీ కార్యకర్తలు ఎలా చెబితే అలా చేస్తానని ఆయన తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ తమకు బాస్ అని ఆయన చెప్పారు.
ప్రతిఏటా పార్టీకి చెందిన సీనియర్ నేతలతో పాటు కార్యకర్తలతో లంచ్ భేటీ నిర్వహిస్తామన్నారు.ఇందులో భాగంగానే ఇవాళ కూడా లంచ్ భేటీ నిర్వహిస్తున్నట్టుగా విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. మరోవైపు విష్ణువర్ధన్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల లంచ్ మీట్‌పై రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సమావేశానికి తనతో పాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు కూడా ఆహ్వానం ఉందన్నారు. తాము ఢిల్లీలో ఉన్నందున ఈ భేటీకి వెళ్లలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. విష్ణువర్ధన్ రెడ్డి నివాసంలో లంచ్ భేటీపై మీడియా చిలువలు పలువలు చేసి కార్యకర్తల్లో గందరగోళం సృష్టించవద్దని కోరారు.
