టిఆర్ఎస్ పార్టీ నేతలకు మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదని ఆరోపించారు కాంగ్రెస్ నాయకురాలు రవళి కూచన. కరీంనగర్ లో మహిళా కార్పొరేటర్లను భయాందోళనకు గురిచేస్తున్న స్థానిక ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సమాజంలో సగ భాగం ఉన్న మహిళలకు మంత్రివర్గంలో చోటు ఇవ్వకుండా అవమానించారని విమర్శించారు. తాజాగా కార్పొరేటర్లను వేధింపులకు గురిచేయడం బాధాకరమన్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రవళి మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.