Asianet News TeluguAsianet News Telugu

Congress Rally: ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ర్యాలీ.. వ్యవసాయశాఖ కమిషనరేట్‌ ఎదుట బైఠాయింపు..

రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించాలన్న (paddy procurement) డిమాండ్‌తో గురువారం పబ్లిక్‌ గార్డెన్స్‌ నుంచి వ్యవసాయశాఖ కమిషనరేట్‌ వరకు కాంగ్రెస్‌ పార్టీ నిరసన ప్రదర్శన ((Congress Rally) చేపట్టింది. ఈ క్రమంలోనే పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో వ్యవసాయ కమిషనరేట్ ఎదుట కాంగ్రెస్ నాయకులు భైఠాయించారు. 

Telangana congress rally in hyderabad demand paddy procurement
Author
Hyderabad, First Published Nov 18, 2021, 1:18 PM IST

రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించాలన్న (paddy procurement) డిమాండ్‌తో గురువారం పబ్లిక్‌ గార్డెన్స్‌ నుంచి వ్యవసాయశాఖ కమిషనరేట్‌ వరకు కాంగ్రెస్‌ పార్టీ నిరసన ప్రదర్శన చేపట్టింది. ధాన్యం కొనుగొళ్లు చేసి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ ర్యాలీలో (Congress Rally) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ నాయకులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, సీతక్క ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జీవన్‌రెడ్డి.. తదితరులు పాల్గొన్నారు. 

అయితే కాంగ్రెస్ శ్రేణుల ర్యాలీ పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలు ర్యాలీ నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తు బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు వ్యవసాయ శాఖ కమిషనరేట్ లోనికి వెళకుండా అడ్డుకుంటున్నారు.  దీంతో వ్యవసాయ కమిషనరేట్ ఎదుట కాంగ్రెస్ నాయకులు భైఠాయించారు. వీహెచ్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, చిన్నారెడ్డి.. ఇతర ముఖ్య నాయకులు బైఠాయించారు. మరోవైపు కొందరు కాంగ్రెస్ శ్రేణులు బారికేడ్లను నెట్టుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. 

టీఆర్‌ఎస్, బీజేపీ రెండు ఒకటేనని.. కలిసి డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ధర్నాలు మానుకుని.. వడ్లను కొనుగోలు చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ చేయాల్సింది ధర్నా కాదని.. సీఎం పదవికి రాజీనామా అని డిమాండ్ చేశారు. 

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వమే ధర్నా చేయడమేమిటని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసి.. కార్పొరేటన్లకు అప్పగించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతులకు అన్యాయం జరుగుతుందని వఅన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios