Asianet News TeluguAsianet News Telugu

రాత్రి 7 గంటలకు టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ.. రాజీవ్ జయంతి, మునుగోడుపైనే చర్చ

తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఈ రోజు రాత్రి ఏడు గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాజీవ్ గాంధీ జయంతి, మునుగోడు ఉపఎన్నికపై నేతలు చర్చించే అవకాశం వుంది.

telangana congress political affairs committee meeting on today at 7 PM
Author
Hyderabad, First Published Aug 19, 2022, 5:12 PM IST

తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఈ రోజు రాత్రి ఏడు గంటలకు సమావేశం కానుంది. వర్చువల్‌గా జరిగే ఈ సమావేశంలో రాజీవ్ గాంధీ జయంతి, మునుగోడు ఉపఎన్నికపై నేతలు చర్చించే అవకాశం వుంది. మునుగోడులోని 176 గ్రామాల్లో కార్యాచరణపై ఇందులో నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే మన మునుగోడు- మన కాంగ్రెస్ నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రస్ నేతలు భావిస్తున్నారు. దీనిపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

ఇకపోతే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ఈ నెల 20వ తేదీన మునుగోడుకు వెళ్లనున్నారు.  మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల విఁషయమై పార్టీ నేతలతో చర్చించనున్నారు. గ్రామాల వారీగా కాంగ్రెస్ సహా ఇతర పార్టీల బల బలాలపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ నియోజకవర్గంలోని 176 గ్రామాల్లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది. ఇప్పటికే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు కాంగ్రెస్ పార్టీ మండలాల వారీగా ఇంచార్జీలను నియమించింది. ఒక్కో మండలానికి ఇద్దరు చొప్పున ఇంచార్జీల నియామకం జరిగింది. మన మునుగోడు మన కాంగ్రెస్ నినాదంతో  కాంగ్రెస్ పార్టీ  ఈ ఎన్నికల్లో ప్రచారం చేయనుంది.  ఈ మేరకు ఈ  పోస్టర్ ను రేవంత్ రెడ్డి ఇవాళ విడుదల చేశారు. 

ALso Read:Munugode bypoll 2022: రేపు మునుగోడుకు రేవంత్ రెడ్డి, 22 నుండి మండలాల వారీగా సమీక్ష

మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి చాన్స్ దక్కే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ స్థానంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని బరిలోకి దింపాలని భావిస్తున్నారని సమాచారం. బీజేపీ, టీఆర్ఎస్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధులను బరిలోకి దింపితే బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధరిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తుంది.ఈ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ ఓటు బ్యాంకును తమ వైపునకు తిప్పుకొనేందుకు బీసీ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తే ఆశాజనకమైన పలితాలు వస్తాయనే విషయమై కూడా కాంగ్రెస్ పార్టీ సర్వేలు నిర్వహించింది.

Follow Us:
Download App:
  • android
  • ios