టీఆర్ఎస్‌లోకి సీఎల్పీ విలీనం ఖాయమన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. తెలంగాణ అసెంబ్లీలోని కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఆదివారం అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియా నాయక్, చిరుమర్తి లింగయ్య సమావేశమయ్యారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల బీ ఫార్మ్స్ కోసమే తాము ఇక్కడికి వచ్చామని తెలిపారు. చివరికి ముగ్గురు మాత్రమే కాంగ్రెస్‌లో మిగులుతారని.. మిగిలిన వారంతా టీఆర్ఎస్‌లోకి వచ్చేస్తారని వారు జోస్యం చెప్పారు. మూడు, నాలుగు రోజుల్లో విలీన ప్రక్రియ పూర్తవుతుందని.. దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. 
"