ఇట్లాంటి సభ నా జీవితంలో చూడలేదు

First Published 17, Nov 2017, 12:49 PM IST
Telangana Congress MLA Jeevan Reddy wonders he has not seen a house worse than this
Highlights
  • అసెంబ్లీలో కాంగ్రెస్ మైక్ కట్ చేస్తున్నారు
  • దళితుల గురించి కాకి వాస్తవాలు చెప్పడంలేదు
  • దళిత సిఎం హామీ ఏమైంది?

తెలంగాణ అసెంబ్లీ జరుగుతున్న తీరుపై కాంగ్రెస్ నేత, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్లాంటి సభ నా జీవితంలో చూడలేదు అని విమర్శించారు. ఆయన శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. ఆ వివరాలు..

సభలో కాంగ్రెస్ మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తున్నారు. సభ నడుపుతోంది స్పీకర్ కాదు. కేసీఆర్ కనుసన్నల్లోనే సభ జరుగుతుంది. తెలంగాణా లో దళితులకు అన్యాయం జరుగుతోంది. దళిత సంక్షేమ నిధులు వృథా చేస్తున్నారు. తెలంగాణా ఏర్పడ్డ నాటి నుంచి దళితుల కోసం ఖర్చు పెట్టిన నిధుల వివరాలతో పెన్ డ్రైవ్ ఇవ్వాలి.

తెలంగాణలో టీఆరెస్ పార్టీని అంతమొందించే వరకు నిద్ర పోము. ప్రశ్నోత్తరాల సమయంలో దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సభ్యుల ప్రశ్నలు విన్న తరువాత సమాధానం ఇవ్వాలి ,కానీ ముందుగానే అన్ని చెప్పేస్తున్నారు. దళితుల ను తప్పుదోవ పట్టిస్తున్నారు.

ప్రగతి పద్దు రూపొందించిన తరువాత ఖర్చులు చెప్తున్నారు. కానీ గడిచిన మూడు బడ్జెట్ లలో ఎంత కేటాయించారు? ఎంత ఖర్చు పెట్టారు అని అడుగుతున్నాం? ఆ విషయాలు చెప్పకుండా వేరే  విషయాలు చెప్తున్నారు. ఇటువంటి సభ నేను ఎప్పుడూ చూడలేదు.

జనాభా ప్రాతిపదికన ఖర్చు చేసే  విధంగా  సబ్ ప్లాన్ రూపొందించినం. కానీ అమలు లేదు. ఇదేనా ప్రజాస్వామ్యం. దళితున్ని సీఎం చేస్తా అన్న హామి ఏమైంది? ఎస్టీ సంక్షేమం కోసం 15765 కేటాయిస్తే 7824 కోట్లు ఖర్చు పెట్టారు. ఎస్సి, ఎస్టీ ల బడ్జెట్ లో కేవలం 50 శాతం కంటే తక్కువ కేటాయించారు.

4 లక్షల డబుల్ బెడ్ రూమ్ లు కట్టిస్తే ఇళ్ళు లేని ఎస్సి, ఎస్టీ లు వుండరు కదా? 2017 - 18 పెన్ డ్రైవ్ కాదు ఇచ్చేది . గత మూడేళ్ళలో జరిగిన ఖర్చుల వివరాలు ఇవ్వండి. అప్పుడు ప్రభుత్వం బండారం బయటపడుతుంది. ఈ విషయంలో టిఆర్ఎస్ పార్టీని గట్టిగానే నిలదీస్తాం అన్నారు జీవన్ రెడ్డి.

loader