హైదరాబాద్: పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంపును  నిరసిస్తూ గాంధీ భవన్ లో దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం నాడు దీక్షకు దిగారు. 

పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచడం ద్వారా దక్షిణ తెలంగాణ జిల్లాలకు తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం పెంచడం వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తెలంగాణకు నష్టం వాటిల్లేలా చేస్తున్న కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

also read:పోతిరెడ్డిపాడు ఎఫెక్ట్: బీజేపీ ఎంపీ బండి సంజయ్ నిరసన

కేసీఆర్ సర్కార్ తీరును నిరసిస్తూ  గాంధీ  భవన్ లోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు దీక్షకు దిగారు. మాజీ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, చిన్నారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీ వి. హనుమంతరావులు దీక్షకు దిగారు. ఈ దీక్షల్లో పాల్గొని తన మద్దతును ప్రకటించనున్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.

ఇదే విషయమై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడ పార్టీ కార్యాలయంలో ఇవాళ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.