టీఆర్ఎస్‌లో వారసత్వం, కేటీఆర్-హరీశ్‌రావుల మధ్య ఆధిపత్యపోరుపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి తనదైన శైలిలో పంచ్‌లు విసిరారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో.. మెదక్ లోక్‌సభ స్థానంలో సాధించబోయే ఓట్ల కంటే కనీసం రెండు ఓట్లైనా గెలిచి చూపిస్తామని హరీశ్‌రావుకి కేటీఆర్ సవాల్ విసిరారు.

దీనిపై మాట్లాడిన విజయశాంతి 2009 ఎన్నికల్లో 162 ఓట్లతో సిరిసిల్లలో గెలిచిన కేటీఆర్.. అదే ఎన్నికల్లో ఎనభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన హరీశ్‌రావుకి సవాల్ విసరడం విడ్డూరంగా ఉందన్నారు.

మరి కేటీఆర్ సవాల్‌ను స్వీకరించి... హరీశ్ ఎక్కువ ఓట్లు సాధించి చూపుతారో లేక కేటీఆర్‌తో పెట్టుకుంటే పూర్తిగా పాతాళానికి తొక్కుతారేమోనని భయపడి రెండు ఓట్లు కరీంనగర్‌ జిల్లాకు వదిలేస్తారో చూడాలన్నారు. కేటీఆర్ సవాల్‌పై హరీశ్ మౌనం పాటించడంపై టీఆర్ఎస్‌లో ముఖ్యమంత్రి కుమారుడి ఆధిపత్యం ఎలా ఉందో అర్థమవుతోందని విజయశాంతి వ్యాఖ్యానించారు.