హైదరాబాద్‌: బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

కొందరు పనిగట్టుకునే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తాను ఎవరినీ కలవడం లేదని స్పష్టం చేశారు.  

ఇకపై తనపై చేస్తున్న దుష్ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రజలు గమనించాలని కోరారు. కొంతమంది కావాలనే చేస్తున్న కుట్ర తప్ప ఇంకేమీ కాదన్నారు దామోదర రాజనర్సింహ. 

ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్:బీజేపీలోకి దామోదర రాజనర్సింహ