ఆర్ .కృష్ణయ్యను కలిశారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు థాక్రే. బీసీలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఆ పార్టీ ఆ వర్గంలో కీలక నేతగా వున్న ఆర్ కృష్ణయ్యను మచ్చిక చేసుకునే పనిలో పడింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహారిస్తోంది. అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లేలా ప్రణాళికలు రూపొందించింది. బీసీలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఆ పార్టీ ఆ వర్గంలో కీలక నేతగా వున్న ఆర్ కృష్ణయ్యను మచ్చిక చేసుకునే పనిలో పడింది. దీనిలో భాగంగా శనివారం ఆర్ .కృష్ణయ్యను కలిశారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు థాక్రే. ఆయన వెంటనే పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా వున్నారు. కృష్ణయ్య ఇంటికి వెళ్లిన థాక్రే పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ కలయికకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.