Asianet News TeluguAsianet News Telugu

ముందస్తు ఎపెక్ట్ : ఎన్నికల మేనిపెస్టోను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు జోరు పెంచడంతో తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ బుధవారం ఏకంగా తమ ఎన్నికల మేనిపెస్టో ను వెల్లడించింది. ఇవాళ గాంధీభవన్ లో సమావేశమైన కాంగ్రెస్ ఎన్నికల మేనిపెస్టో కమిటీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇవ్వాల్సిన హామీలపై కసరత్తు చేసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనుల గురించి టిపిసిసి  ప్రెసిడెంట్ ఉత్తమ్ మీడియా కు వివరించారు. 

Telangana Congress Finalises Election Manifesto For Upcoming Elections
Author
Hyderabad, First Published Sep 5, 2018, 4:03 PM IST

తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు జోరు పెంచడంతో తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ బుధవారం ఏకంగా తమ ఎన్నికల మేనిపెస్టో ను వెల్లడించింది. ఇవాళ గాంధీభవన్ లో సమావేశమైన కాంగ్రెస్ ఎన్నికల మేనిపెస్టో కమిటీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇవ్వాల్సిన హామీలపై కసరత్తు చేసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనుల గురించి టిపిసిసి  ప్రెసిడెంట్ ఉత్తమ్ మీడియా కు వివరించారు. 

కాంగ్రెస్ పార్టీ మేనిపెస్టోలోని అంశాలు:
 
1. టీఆర్ఎస్ ప్రభుతవంలో బిసి, మైనారిటీ వర్గాలే ఎక్కువ నష్టపోయారని తెలిపిన ఉత్తమ్ వారి కోసం పలు పథకాలను రూపొందించినట్లు తెలిపారు. బిసి, మైనారిటీల జనాభా ప్రాతిపదికన సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతే కాకుండా మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిచనున్నట్లు తెలిపారు.

2.  పిడిఎస్ (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) వ్యవస్థను మరింత మెరుగపర్చనున్నట్లు తెలిపారు. గతంలో మాదిరిగా అమ్మ హస్తం పథకం కింద 9 రకాల సరుకులు అందించనున్నటలు తెలిపారు. ఇక ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో రూపియికి కిలో కిందనే ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. దళిత, గిరిజనులకు ఉచితంగా రేషన్ సరుకులు అందిస్తామని తెలిపారు.

3. రేషన్ డీలర్ విషయంలో కూడా సానుకూలంగా స్పందిచినట్లు ఉత్తమ్ తెలిపారు. రేషన్ డీలర్ల విషయంలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాజకీయ కుట్ర జరిగిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగాడీలర్లను హింసించడం కాకుండా వారి కమీషన్  ను పెంచనున్నట్లు తెలిపారు.   క్వింటాల్ బియ్యంపై డీలర్లకు వంద రూపాయల కమీషన్ ఇస్తామని హామీనిచ్చారు. 

4. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం ఆపేసిన 4 లక్షల ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చెల్లిస్తామన్నారు. అలాగే ఇళ్లు లేని కుటుంబాలకు ఐదు లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు, ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులకు మరో లక్ష అదనంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు ఉన్నవారికి మరో గది అదనంగా నిర్మించుకోడానికి రూ. 2 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 

5. విద్యుత్ విషయంలో పలు మార్పులు చేయనున్నట్లు ఉత్తమ్ స్పష్టం చేశారు. దళిత, గిరిజనులకు గృహ అవసరాలకు 200 యూనిట్ల  విద్యుత్  ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే మొత్తం డొమెస్టిక్ యూజర్స్ కి కరెంట్ చార్జీల తగ్గించే ప్రయత్నం చేయనున్నట్లు తెలిపారు. దేవాలయాలు, మసీదులు, చర్చీలు, గురుద్వారాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు హామీ ఇచ్చారు. 

6. ఇక బిపిఎల్ కుటుంబాలకు ఏడాదికి 6 ఎల్పీజీ సిలిండర్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 

7. బాలికల విద్యని ప్రోత్సహించడానికి ప్రతి బాలికకి ఉచితంగా సైకిల్స్ అందించనున్నట్లు తెలిపారు. 

 8. దివ్యాంగుల పెళ్లికి రెండు లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు ఉత్తమ్ హామీ ఇచ్చారు. 

9. రూ. 500 కోట్లతో గల్ఫ్ బాధితుల నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తమ్ తెలిపారు. అలాగే ఇప్పటికే గల్ఫ్ లో మృతిచెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

10. బిపిఎల్ కుటుంబాలకు ప్రమాద భీమా సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు.

11. అన్ని రకాల పెన్షన్లను రెట్టింపు చేయనున్నట్లు  ఉత్తమ్ ప్రకటించారు.

12.కల్యాణ లక్ష్మి, బంగారు తల్లి పథకాలను పునరుద్దరించి మరింత మెరుగ్గా అమలుచేయనున్నట్లు ప్రకటించారు.

13. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మిడ్ మానేరు నిర్వాసితులను డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.

 

మరిన్ని వార్తల కోసం కింది లింక్స్ పై క్లిక్ చేయండి

ముందస్తు ఎన్నికలు: ఏం హామీలు ఇవ్వాలి.. కాంగ్రెస్ హైటెన్షన్

Follow Us:
Download App:
  • android
  • ios