ముందస్తు ఎన్నికలు: ఏం హామీలు ఇవ్వాలి.. కాంగ్రెస్ హైటెన్షన్

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 5, Sep 2018, 11:47 AM IST
telangana congress manifesto committee meeting today
Highlights

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తప్పవని స్పష్టమైన సంకేతాలు వస్తుండటంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జనాల్లో బలంగా ఉన్న కేసీఆర్ ఛరిష్మాను తట్టుకుని నిలబడాలంటే ప్రజలను ఆకర్షించే హామీలు ఇవ్వాలి.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తప్పవని స్పష్టమైన సంకేతాలు వస్తుండటంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జనాల్లో బలంగా ఉన్న కేసీఆర్ ఛరిష్మాను తట్టుకుని నిలబడాలంటే ప్రజలను ఆకర్షించే హామీలు ఇవ్వాలి. ఇప్పుడు ఇదే పార్టీలకు పెద్ద సమస్యగా మారింది. వచ్చే వేసవిలో ఎన్నికలు వస్తాయి అనుకుంటే.. ముందుగా వచ్చేస్తుండటంతో నేతలు హైరానా పడుతున్నారు. 

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పరిస్ధితి మరింత ఘోరంగా తయారైంది. ఎన్నికల నాటికి జనాల్లోకి బలంగా వెళ్లేందుకు గాను.. యాత్రలు ప్లాన్ చేసుకుంటున్న టీ.కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ ముందస్తు నిర్ణయం షాకిచ్చింది. దీంతో ప్రజలను ఆకర్షించేందుకు ఏం హామీలు ఇవ్వాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు టీపీసీసీ నేతలు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఇవాళ అత్యవసరంగా సమావేశం కానుంది. 

ఇప్పటికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి హామీలను ప్రకటించింది కాంగ్రెస్. వీటికి తోడు మేనిఫెస్టో‌లో చేర్చాల్సిన అంశాలపై ఈ కమిటీ సీనియర్ల అభిప్రాయం తీసుకోనుంది. వారి ఫీడ్ బ్యాక్ అనంతరం మేనిఫెస్టోకి ఒక స్పష్టమైన రూపు తెచ్చేందుకు కమిటీ సభ్యులు శ్రమిస్తున్నారు. 

loader