సీఎం కేసీఆర్ సవాల్ ను స్వీకరించిన ఉత్తమ్, ఎప్పుడైనా సిద్దమేనంటూ ట్వీట్

First Published 25, Jun 2018, 11:17 AM IST
telangana congress chief uttam kumar reddy receives kcr challege
Highlights

అది 2019 మే అయినా, 2018 డిసెంబర్ అయినా...

తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న ఆదివారం కాంగ్రెస్ పార్టీకి విసిరిన సవాల్ ను పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ దేనికీ వెనుకాడబోదని సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెట్టించిన ఉత్సాహంతో సిద్దంగా ఉన్నట్లు ఉత్తమ్ తన అధికారిక ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు సంకేతాలిచ్చి తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి శుభవార్త చెప్పారని అన్నారు. ఇలా ముందస్తుకు పోయి కేసీఆర్ తన గోతిని తానే తవ్వుకుంటున్నాడంటూ ఉత్తమ్ ఎద్దేవా చేశాడు. 

నిన్న ఆదివారం దానం నాగేందర్ టీఆర్ఎస్ పార్టీలోకి కండువా కప్పి చేర్చుకున్న విసయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...ముందస్తు ఎన్నికలపై సంకేతాలిచ్చారు. అయితే ఈ ఎన్నికలను అసలు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోగలదా అంటూ సవాల్ విసిరారు. దీనికి కౌంటర్ గా ఇవాళ ఉత్తమ్ స్పందించారు.

ఎన్నికలు ముందస్తుగా 2018 డిసెంబర్ లో జరిగినా, 2019 మే లో జరిగినా లేదా ఈ రోజు జరిగినా ఎదుర్కోడానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంసిద్దంగా ఉందని ఉత్తమ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవిసీతి, అక్రమాలను ఎంబగట్టడానికి ఇదో మంచి అవకాశమని ఉత్తమ్ తెలిపారు.  కొన్ని నెలల ముందుగానే కేసీఆర్ సర్కార్‌ను గద్దె దింపడానికి తమకు మంచి అవకాశం వస్తోందంటూ ఉత్తమ్ ట్వీట్ చేశారు.


 

loader