MLC Kavitha: 30 లక్షల ఉద్యోగాల వివరాలేవో చెప్పాలి: కవితపై కాంగ్రెస్ ఎటాక్
ఎమ్మెల్సీ కవిత 30 లక్షల ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని చెబుతున్నదని కాంగ్రెస్ పేర్కొంది. ఆ 30 లక్షల ఉద్యోగాల వివరాలు, ఆ లెక్కేదో చెప్పాలని డిమాండ్ చేసింది.
Congress: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుతున్నది. ఇప్పుడు ఉద్యోగాల కల్పన అంశం ఉభయ పార్టీల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉద్యోగాల కల్పనపై మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. అసలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని కవిత చెబుతున్నారని, వాటి వివరాలేవో చెప్పాలని ప్రశ్నించింది. ఆ లెక్క ఏదో చెప్పాలని డిమాండ్ చేసింది.
ఈడీ నోటీసులు వచ్చిన ప్రతిసారి కవిత ఢిల్లీకి వెళ్లి టెంట్ వేస్తారని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్లలో చేయని పనులను కాంగ్రెస్ పార్టీ ఈ వంద రోజుల్లో చేసి చూపెట్టనుందని తెలిపింది. గత ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ఏ చర్య కూడా తీసుకోలేదని ఆరోపించింది. ఇక తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉంటే తట్టుకోలేక కవిత అసహనానికి లోనవుతున్నదని ఫైర్ అయింది. గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతలు భవాని రెడ్డి, సునీత పాల్, జ్ఞాన సుందర్‌లు మీడియాతో మాట్లాడారు.
Also Read: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మూడేసి స్థానాలకు ఎన్నికలు
రేవంత్ రెడ్డి ప్రజల ముఖ్యమంత్రి అని, ఆయన ప్రజల కోసమే ఆలోచిస్తారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. కానీ, కేటీఆర్ ప్రజలను వాడుకుంటూ డ్రామాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కోసం పని చేస్తున్నదని ఆరోపణలు చేశారు. కానీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్నడూ ఒక్కటి కాలేవన్నారు.