జీవో 111 ఎత్తివేత పరిణామాలపై అధ్యయనం: ఏడుగురితో కాంగ్రెస్ కమిటీ
జీవో 111 ఎత్తివేతపై చోటు చేసుకొనే పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ ఏడుగురితో కమిటీని ఏర్పాటు చేసింది.
హైదరాబాద్: జీవో 111 ఎత్తివేతతో చోటు చేసుకునే పరిణామాలపై ఏడుగురితో కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ కాంగ్రెస్, మాజీ మంత్రి కోదండరెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. జీవో 111 ఎత్తివేతతో చోటు చేసుకునే పరిణామాలపై కమిటీని ఏర్పాటు చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవలనే ప్రకటించిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం ఇవాళ ఉదయం గాంధీ భవన్ లో ప్రారంభమైంది. ఈ సమావేశంలో కమిటీని ఏర్పాటు చేస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో కోదండరెడ్డితో పాటు మాజీ మంత్రి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించారు. మరో వైపు ఇద్దరు నిపుణులను కూడా కమిటీలో చేర్చారు.
ఇదిలా ఉంటే జీవో 111 ఎత్తివేతతో ఈ ప్రాంతంలో ఎంతమంది రాజకీయ నేతలకు భూములున్న విషయమై కూడా ఈ కమిటీ సేకరించింది. జీవో 111 ఎత్తివేత కారణంగా సామాన్య రైతుల కంటే బడా రాజకీయ నేతలకు, రియల్ ఏస్టేట్ సంస్థలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందనే విమర్శలు కూడ లేకపోలేదు.
జీవో 111 ఎత్తివేత కారణంగా జంట జలాశయాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ నెల 18న జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం జీవో 111 ను ఎత్తివేసింది .