తెలంగాణ చలి మళ్లీ పంజా విసురుతోంది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. దీంతో ప్రజలకు చలికి వణికిపోతున్నారు. తెలంగాణలో నేడు, రేపు చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణ చలి మళ్లీ పంజా విసురుతోంది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. దీంతో ప్రజలకు చలికి వణికిపోతున్నారు. తెలంగాణలో నేడు, రేపు చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం తెల్లవారుజామున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్​ జిల్లాలోని అర్లి(టీ)లో 6, జిల్లా కేంద్రంలో 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో జనాలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆది, సోమ వారాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

ఇక, బిహార్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉత్తర తెలంగాణ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి శనివారం బలహీనపడినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య దిశలో తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నట్టుగా చెప్పింది. ఉపరిత ద్రోణి బలహీన పడినప్పటికీ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. 

రాష్ట్రంలో సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో చలితీవ్రత పెరుగుతుందని తెలిపింది. శనివారం అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇంకా మెదక్‌లో 11.5 డిగ్రీలు, రామగుండంలో 11.6 డిగ్రీలు, హన్మకొండలో 12.5 డిగ్రీలు, దుండిగల్‌లో 13.6 డిగ్రీలు, హైదరాబాద్‌లో 13 డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక, గరిష్టంగా భద్రాచలంలో 32.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.