తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ రెండు, మూడు రోజులుగా వార్తల్లో నిలుస్తోంది.

సదరు హెల్ప్‌లైనుకు ఎవరో ఫోన్ చేసి తమ అభిప్రాయాలు చెప్పినట్లుగా పత్రికల్లో, ఛానెళ్లతో పాటు సోషల్ మీడియాలోనూ దుష్ప్రచారం జరుగుతోంది. విషయం సీఎంవో దృష్టికి చేరడంతో అధికారులు స్పందించారు.

ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది మాట్లాడినట్లుగా గుర్తు తెలియని వ్యక్తులు ఫేక్ వాయిస్ సృష్టించారని.. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకవాల్సిందిగా సీఎంవో అధికారులు నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేశారు.

తక్షణం స్పందించి తప్పుడు ప్రచారాన్ని ఆపాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది.