Asianet News TeluguAsianet News Telugu

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ: జల వివాదం, ఉద్యోగ నియామకాలపై కీలక చర్చ


రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలతో పాటు ఏపీ రాష్ట్రంతో జల వివాదంపై తెలంగాణ రాష్ట్ర కేబినెట్ చర్చించనుంది. ఈ రెండు అంశాలతో పాటు మరిన్ని కీలక విషయాలపై కేసీఆర్ కేబినెట్ ఇవాళ చర్చించనుంది.

Telangana CM to hold cabinet meeting today lns
Author
Hyderabad, First Published Jul 13, 2021, 9:35 AM IST


హైదరాబాద్:  కృష్ణా జలాలపై వివాదం,  ఉద్యోగ నియామకాల తో పాటు ఇతర కీలక అంశాలపై తెలంగాణ కేబినెట్ మంగళవారంనాడు కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం ప్రగతి భవన్ లో  కేబినెట్ సమావేశం జరగనుంది.రాష్ట్రంలో  50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆయా ప్రభుత్వశాఖల్లో ఖాళీగా పోస్టుల వివరాలను అధికారులు గుర్తించారు.ఈ మేరకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్  ఆయా ప్రభుత్వశాఖల్లోని  ఖాళీల వివరాలను పంపాలని కోరారు. ఈ మేరకు ఖాళీల వివరాలను సీఎస్ కేబినెట్ దృష్టికి తీసుకురానున్నారు. ఈ  ఖాళీలపై చర్చించనుంది కేబినెట్ .

కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయమై కూడ తెలంగాణ ప్రభుత్వం చర్చించనుంది. ఈ విషయమై ఇప్పటికే కేంద్రానికి కూడ తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఏపీ ప్రభుత్వం కూడ ప్రధానికి లేఖలు రాసింది.  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై  ఎన్జీటిలో  తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ చేసే సిఫారసులపై  చర్చించనున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతులకు అవసరమైన ఎరువువులు, విత్తనాలు  రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది.  మరో వైపు 
 

Follow Us:
Download App:
  • android
  • ios