తెలంగాణలో కార్పోరేషన్ ఛైర్మన్‌ల నియామకాలు రద్దు
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో వివిధ కార్పోరేషన్ ఛైర్మన్‌ల నియామకాలు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా కార్పోరేషన్ ఛైర్మన్ల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ కార్పోరేషన్ ఛైర్మన్‌ల నియామకాలు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 54 కార్పోరేషన్ ఛైర్మన్‌ల నియమకాల రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.