హైదరాబాద్: కరోనా నుండి  తెలంగాణ సీఎం కేసీఆర్ పూర్తిగా కోలుకొన్నారు. కరోనా నుండి కోలుకొన్న తర్వాత సీఎం కేసీఆర్ తొలిసారిగా గురువారం నాడు ప్రగతి భవన్ కు చేరుకొంటారు. కరోనాపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఇటీవలనే సీఎం కేసీఆర్ కరోనా బారినపడ్డారు. కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే  ఆయన ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్ లో  హోం క్వారంటైన్ లో ఉన్నారు.

సీఎం కేసీఆర్  కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది.  దీంతో సీఎం హైద్రాబాద్  రానున్నారు. కరోనా నుండి కోలుకొన్న తర్వాత సీఎం హైద్రాబాద్ ప్రగతి భవన్ కు రానున్నారు. గత నెల 19వ తేదీన కేసీఆర్ కు కరోనా సోకింది. ఈ నెల 4వ తేదీన ఆయనకు కరోనా పరీక్షల్లో నెగిటివ్ గా నిర్ధారణ అయింది. 

also read:కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న సీఎం కేసీఆర్, వైద్యుల ధ్రువీకరణ

ప్రగతి భవన్ లో  కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.  ఈ సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత  కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను తప్పించిన తర్వాత  కరీంనగర్  జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశం కావడం ఇదే తొలిసారి.