Asianet News TeluguAsianet News Telugu

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ సతీమణి శోభ.. (వీడియో)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

Telangana CM KCR WIfe Shobha Offers prayers in tirumala temple ksm
Author
First Published Oct 10, 2023, 11:35 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందుకోసం  సోమవారం సాయంత్రమే కేసీఆర్ సతీమణి శోభ కొందరు కుటుంబ సభ్యులతో తిరుమలకు చేరుకున్నారు.  ఈ సందర్భంగా ఆమె తిరుమలలో తలనీలాలను సమర్పించారు. అనంతరం మంగళవారం వేవజామున అర్చన సేవలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్ధప్రసాదాలు అందజేశారు. టీటీడీ అధికారులు స్వామివారి చిత్ర పటాన్ని బహూకరించారు. ఇక, కేసీఆర్ సతీమణి శోభ తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న సమయంలో.. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్ని దగ్గరుండి చూసుకున్నట్టుగా తెలుస్తోంది. 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios