Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కు కేసీఆర్ పరామర్శ: శాంతమ్మ సమాధి వద్ద నివాళులు

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను సీఎం కేసీఆర్ పరామర్శించారు. మంత్రి తల్లి శాంతమ్మ గుండెపోటుతో మరణించారు. శాంతమ్మ సమాధి వద్ద కేసీఆర్ నివాళులర్పించారు. 

Telangana CM KCR Visits Minister Srinivas Goud Residence
Author
Hyderabad, First Published Nov 7, 2021, 3:11 PM IST

మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు పరామర్శించారు.తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి Srinivas Goud తల్లి Shantamma అనారోగ్య కారణాలతో ఇటీవల మరణించారు. శాంతమ్మ దశదిన కర్మను ఇవాళ మహబూబ్‌నగర్‌లోని పాలకొండలో నిర్వహించారు. శాంతమ్మ దశదిన కర్మలో కేసీఆర్ పాల్గొన్నారు. 

శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ తల్లి సమాధి వద్ద Kcr నివాళులర్పించారు.  శాంతమ్మ మరణానికి దారి తీసిన పరిస్థితుల గురించి కేసీఆర్ అడిగి తెలుసుకొన్నారు. శాంతమ్మ సమాధి వద్దే మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కేసీఆర్ ముచ్చటించారు. కేసీఆర్ తో పాటు తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో పాటు ఉమ్మడ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. శాంతమ్మ స్మృతులతో ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు..

గత నెల 29వ తేదీన రాత్రి శాంతమ్మకు గుండెపోటు రావడంతో ఆమె మరణించారు. శనివారం నాడు పాలకొండలోని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయక్షేత్రంలో శాంతమ్మ అంత్యక్రియలు నిర్వహించారు ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ మరణించారు.  ఒకే ఏడాదిలో తల్లీ, తండ్రి ఇద్దరూ మరణించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios