సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును శుక్రవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ పరిశీలించారు. 

ఎవరికి చెప్పకుండానే సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చారు.కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు కట్టపై తిరుగుతూ గోదావరి జలాలను పరిశీలించారు. మర్కూక్ లో కొండపోచమ్మ ప్రాజెక్టు నీటి సామర్ధ్యం పరిశీలించారు.

ఆకస్మికంగా కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టును ఆయన పరిశీలించడం సంచలనం కల్గించింది.సుమారు 45 నిమిషాలపాటు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు కట్టపై తిరుగుతూ గోదావరి నది జలాలను ఆయన పరిశీలించారు. ప్రాజెక్టులో ఏమైనా లోపాలు ఏమైనా ఉన్నాయా అని కూడ ఆయన స్థానికులను కేసీఆర్ అడిగి తెలుసుకొన్నారు.ఈ ఏడాది మే 29వ తేదీన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కు గోదావరి నీళ్లు చేరుకొన్నాయి. 

మర్కూక్ పంప్‌హౌస్ నుండి కొండపోచమ్మ సాగర్ కు నీటిని లిఫ్ట్ చేశారు.88 మీటర్ల నుండి 618 మీటర్ల ఎత్తు వరకు గోదావరి నీటిని కొండపోచమ్మ రిజర్వాయర్ కు నీటిని లిఫ్ట్ చేశారు.

హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేలా 15 టీఎంసీల సామర్థ్యంతో ఈ జలాశయం నిర్మాణం చేపట్టారు. కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ లో 15 టీఎంసీల నీటిని నిల్వ చేసుకొనే సామర్ధ్యం ఉంటుంది. 

ఈ రిజర్వాయర్ వలయాకారం కట్ట 15.8 కిలోమీటర్లుఉంటుంది. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1540 కోట్లు. ఈ రిజర్వాయర్ల ద్వారా 2,85,280 ఎకరాలకు సాగు నీరు అందనుంది. మరో వైపు హైద్రాబాద్ తాగు నీటి అవసరాలను కూడ తీర్చనుంది ఈ రిజర్వాయర్.

కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్,యాదాద్రి భువనగిరి జిల్లాలకు సాగు నీరు అందనుంది.  ఈ రిజర్వాయర్ ద్వారా రామాయంపేట, గజ్వేల్, ఉప్పరపల్లి, కిష్టాపూర్, తుర్కపల్లి, జగదేవ్ పూర్, తుర్కపల్లి(ఎం), శంకరంపేట, సంగారెడ్డి ప్రధాన కాల్వలున్నాయి.

557 మీటర్ల ఎత్తులోని రంగనాయక్‌సాగర్‌ నుంచి తుక్కాపూర్‌ పంప్‌హౌజ్‌ కు గోదావరి నీళ్లు చేరుతాయి. అక్కడి నుంచి అక్కారం, మర్కూర్‌ పంప్‌హౌజ్‌లలో ఎత్తిపోయడం ద్వారా గోదావరి జలాలు 618 మీటర్ల ఎత్తులోని 15 టీఎంసీల సామర్థ్యం గల కొండపోచమ్మ కు చేరుకుంటాయి. లక్ష్మీబరాజ్‌ నుంచి సుమారు  214 కిలోమీటర్లు ప్రవహించి ప్రాజెక్టులోనే అత్యంత ఎత్తుకు చేరుకుంటాయి.