Asianet News TeluguAsianet News Telugu

చినజీయర్ స్వామి కాళ్లకు మొక్కిన కేసీఆర్...ప్రత్యేక పూజలు చేశారా?

తెలంగాణ లో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలన్ని ప్రాచారాన్ని ముమ్మరం చేశాయి. టీఆర్ఎస్ పార్టీత అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జిల్లాల పర్యటనకు రంగం సిద్దం చేసుకున్నారు. ఇదివరకు ప్రకటించినట్లు తెలంగాణలోని ప్రతి నియోజకర్గంలో ఆయన ప్రచారం చేయనున్నారు. ఈ ప్రచారాన్ని మరికొద్దిరోజుల్లో పరుగులెత్తించాలని భావిస్తున్న కేసీఆర్ అంతకు ముందు తన గురువుగా భావించే చినజీయర్ స్వామిని కలిసి ఆశిర్వాదం తీసుకున్నారు. 

telangana cm kcr visits chinajiyar swami ashram
Author
Shamshabad, First Published Nov 10, 2018, 3:07 PM IST

తెలంగాణ లో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలన్ని ప్రాచారాన్ని ముమ్మరం చేశాయి. టీఆర్ఎస్ పార్టీత అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జిల్లాల పర్యటనకు రంగం సిద్దం చేసుకున్నారు. ఇదివరకు ప్రకటించినట్లు తెలంగాణలోని ప్రతి నియోజకర్గంలో ఆయన ప్రచారం చేయనున్నారు. ఈ ప్రచారాన్ని మరికొద్దిరోజుల్లో పరుగులెత్తించాలని భావిస్తున్న కేసీఆర్ అంతకు ముందు తన గురువుగా భావించే చినజీయర్ స్వామిని కలిసి ఆశిర్వాదం తీసుకున్నారు. 

హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని దివ్యసాకేత ఆశ్రమానికి చేరుకున్న కేసీఆర్ చినజీయర్ స్వామి ఆశిర్వాదాన్ని తీసుకున్నారు. అనంతరం ఇరువురు కాస్సేపు ఏకాంతంగా చర్చలు జరిపారు. అనంతరం ఇద్దరు కలిసి బైటికివచ్చి అక్కడున్నవారితో ముచ్చటించారు. 

అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చింతల్ ఆశ్రమంలో ప్రత్యేక యాగాన్ని నిర్వహించడానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. జాతకాలు, వాస్తులు, దోషాలను ఎక్కువగా నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో గెలుపు కోసమే ఈ యాగం నిర్వహించినట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios