Asianet News TeluguAsianet News Telugu

వరంగల్ ఎంజీఎంను సందర్శించిన కేసీఆర్.. కరోనా వార్డుల పరిశీలన..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని కరోనా రోగుల్లో మానసికస్థైర్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వరుసగా కరోనా ఆస్పత్రులను సందర్శిస్తూ, నేరుగా కరోనా వార్డుల్లోని రోగులతో సంభాషిస్తూ వారికి నేనున్నాననే భరోసాను ఇస్తున్నారు.
 

telangana cm KCR visited MGM hospital in warangal - bsb
Author
hyderabad, First Published May 21, 2021, 1:33 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని కరోనా రోగుల్లో మానసికస్థైర్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వరుసగా కరోనా ఆస్పత్రులను సందర్శిస్తూ, నేరుగా కరోనా వార్డుల్లోని రోగులతో సంభాషిస్తూ వారికి నేనున్నాననే భరోసాను ఇస్తున్నారు.

తాజాగా శుక్రవారం తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎంజీఎంను సందర్శించారు. ఆయ‌న వెంట‌ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, వరంగ‌ల్ జిల్లా ప్రజాప్రతినిధులు, ప‌లువురు అధికారులు ఉన్నారు. 

వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బందితో క‌లిసి ఎంజీఎంలోని సౌక‌ర్యాల‌ను ఆయ‌న అడిగి తెలుసుకుంటున్నారు. కరోనా రోగులను ప‌రామ‌ర్శించి వారికి అందుతున్న సేవలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెబుతున్నారు. 

నిన్న గాంధీ... నేడు ఏజిఎం... కరోనా రోగులకు సీఎం కేసీఆర్ భరోసా...

కరోనా రోగులు చికిత్స పొందుతున్న వార్డులను కేసీఆర్ పరిశీలిస్తున్నారు. వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆసుప‌త్రిలో పడకలు, ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, ఔష‌ధాల‌పై సీఎం కేసీఆర్ చ‌ర్చించ‌నున్నారు.

ఎంజీఎం పర్యటన అనంతరం వరంగల్‌ సెంట్రల్‌ జైలును పరిశీలించి, జైలు ప్రాంగణంలోని 73 ఎకరాల్లో కొత్త ఆసుప‌త్రి నిర్మాణంపై అధికారులతో మాట్లాడతారు. ఇటీవ‌లే కేసీఆర్ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుప‌త్రిలోనూ క‌రోనా రోగుల‌తో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన విష‌యం తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios