మంత్రులు, పార్టీ నేతలతో నేడు కేసీఆర్ భేటీ: రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రివర్గ సహచరులు, పార్టీ ముఖ్యనేతలు, పార్లమెంటరీపక్ష నేతలతో శుక్రవారం నాడు భేటీ కానున్నారు. రాష్ట్రపతి ఎన్నికలపై కేసీఆర్ చర్చించనున్నారు.
హైదరాబాద్: Telangana సీఎం KCR మంత్రులు, శాసనసభ, పార్లమెంటరీ పక్ష నేతలతో శుక్రవారం నాడు సాయంత్రం భేటీ కానున్నారు. President ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ఈ నెల 9వ తేదీన Election Commission విడుదల చేసింది.
ఎర్రవెల్లి పామ్ హౌస్ లో ఉన్న సీఎం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నానికి ప్రగతి భవన్ కు చేరుకుంటారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ఈ సమావేశం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ ఠేటీ అయినట్టుగా సమాచారం. రాష్ట్రపతి ఎన్నికలతో పాటు, రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పరిస్థితిపై ప్రశాంత్ కిషోర్ టీమ్ నిర్వహించిన సర్వే నివేదికపై చర్చించినట్టుగా సమాచారం.
also read:జూలై 18న పోలింగ్: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఇటీవల కాలంలో బీజేపీకి వ్యతిరేకంగా పలు పార్టీల నేతలు, పలు రాష్ట్రాల సీఎంలను కేసీఆర్ కలుస్తున్నారు. గత మాసంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, మాజీ ప్రధాని దేవేగౌడలతో కేసీఆర్ భేటీ అయ్యారు. దేశంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రపతి ఎన్నికలతో పాటు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా కేసీఆర్ ఆయా పార్టీలతో చర్చించారని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ఎవరిని బరిలోకి దింపుతుందోననే విషయమై టీఆర్ఎస్ నాయకత్వం చూస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్ధిని బరిలోకి దింపే విషయమై కాంగ్రెస్ పార్టీ కూడా పలు పార్టీల నేతలతో చర్చలు జరుపుతుంది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో మల్లిఖార్జున ఖర్గే శరద్ పవార్ తో భేటీ అయ్యారు. పలు పార్టీలతో కూడా రాష్ట్రపతి ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కూడా చర్చలు జరుపుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ప్రకటించే అభ్యర్ధి ఆధారంగా తాము అభ్యర్ధిని బరిలోకి దింపాలనే యోచనలో విపక్షాలున్నాయి.
కొంత కాలంగా బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ తన స్వరం పెంచారు. త్వరలోనే సంచలన వార్త వింటారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే కేసీఆర్ చెప్పే సంచలనం ఏమిటనే విషయమై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ తీరుతో దేశం అస్తవ్యస్తంగా మారిందని కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. బీజేపీ తీరుపై విపక్షాలు ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు కేసీఆర్ చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం అప్పులు తీసుకొనే విషయంలో కేంద్రం ఆంక్షలు విధించడం వంటి వాటిని కూడా కేసీఆర్ సర్కార్ తీవ్రంగా తీసుకుంది. ఉద్దేశ్యపూర్వకంగానే తమ రాష్ట్రంపై కేంద్రం ఈ రకంగా వ్యవహరిస్తుందని టీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు.ఈ విషయమై తమ పార్టీ వైఖరిని కేసీఆర్ పార్టీ నేతలకు వివరించే అవకాశం ఉంది.