Asianet News TeluguAsianet News Telugu

ఈసారి ‘‘ ముందస్తు ’’ ఆలోచన లేదు.. 26, 27లలో హుజురాబాద్‌‌కు వస్తున్నా: టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో కేసీఆర్

టీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత జోష్ నింపేందుకు గాను పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ‌ఈ నెల 26, 27 తేదీలలో హుజురాబాద్‌లో జరిగే ఎన్నికల సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్‌ఎల్పీ (trslp) సమావేశంలో కేసీఆర్ ప్రకటించారు. 

telangana cm kcr to campaign in huzurabad bypoll on october 26th and 27th
Author
Hyderabad, First Published Oct 17, 2021, 5:18 PM IST

హుజురాబాద్ ఉపఎన్నికకు (huzurabad bypoll) సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో అన్ని పార్టీలు ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ (trs), బీజేపీలు (bjp) దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే దళిత బంధు (dalit bandhu) వంటి పథకంతో పాటు హుజురాబాద్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా టీఆర్ఎస్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మంత్రులు హరీశ్ రావు, (harish rao),  కొప్పుల ఈశ్వర్ (koppula eshwar) , గంగుల కమలాకర్‌లు (gangula kamalakar) ఎన్నిక బాధ్యతను భుజానికెత్తుకుని ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత జోష్ నింపేందుకు గాను పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ‌ఈ నెల 26, 27 తేదీలలో హుజురాబాద్‌లో జరిగే ఎన్నికల సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్‌ఎల్పీ (trslp) సమావేశంలో కేసీఆర్ ప్రకటించారు. 

టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల నిర్వహణతో పాటు, పార్టీ ప్లీనరీ భవిష్యత్తులో నిర్వహించాల్సిన అంశాలపై పార్టీ ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ చర్చించారు. ఈ సారి తాను ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని సీఎం శ్రేణులకు తెలిపారు. మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా వున్నాయని.. ఇంకా రెండేళ్లు వుందని అన్ని పనులు మనమే చేసుకుందామని కేసీఆర్ చెప్పారు.

ALso Read:టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కేసీఆర్ భేటీ: కీలకాంశాలపై చర్చ

వచ్చే నెల 15న తెలంగాణ విజయ గర్జన పేరుతో వరంగల్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాలపై సీఎం కేసీఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులకు దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే అంశంపై కూడా గులాబీ బాస్ పలు సూచనలు చేశారు. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రత్యర్ధులు తమకు సవాల్ విసరడానికి కూడా అందనంత ఎత్తులో పార్టీ బలంగా ఉండాలని కేసీఆర్ శ్రేణులకు తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సీఎం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు కట్టబెట్టారు. మరో వైపు పార్టీ కోసం పనిచేసిన వారికే త్వరలో నామినేటేడ్ పదవులు ఇవ్వనున్నారు. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా వార్డు, గ్రామ, మండల కమిటీ అధ్యక్షుల ఎన్నిక పూర్తైంది. రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కోసం ఇవాళే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 

కాగా, టీఆర్ఎస్‌లో కీలకనేతగా వున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender) భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి , మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. అనంతరం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈటల రాజేందర్ రాజీనామాతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ తరపు నుంచి ఈటల, కాంగ్రెస్ నుంచి వెంకట్ బల్మూరి (venkat balmoor) , టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లు (srinivas yadav) బరిలో నిలిచారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios